Chicken Races : కోడి పందాలకు సిద్ధమైన గోదావరి జిల్లాలు

ఏపీలో కోడి పందాలకు సర్వం సిద్ధమైంది. కోడి పందాలకు గోదావరి జిల్లాలు రెడీ అయ్యాయి. రాజకీయ నాయకుల అండతో పందెం బరులను నిర్వహకులు సిద్ధం చేశారు.

Chicken Races : కోడి పందాలకు సిద్ధమైన గోదావరి జిల్లాలు

chicken races

Chicken Races :  తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేసుకుంటూ రెండు రాష్ట్రాల ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.  మరోవైపు ఏపీలో కోడి పందాలకు సర్వం సిద్ధమైంది. కోడి పందాలకు గోదావరి జిల్లాలు రెడీ అయ్యాయి. రాజకీయ నాయకుల అండతో పందెం బరులను నిర్వహకులు సిద్ధం చేశారు. కోనసీమ జిల్లాల్లో పలు చోట్ల పందెం బరులు రెడీ చేశారు. 30 నుంచి 40 ఎకరాల పరిధిలో 1500 పందెం బరులు సిద్ధమయ్యాయి. ఐదెకాల పరిధిలో 150 పందెం బరులను నిర్వహకులు సిద్ధం చేశారు.

భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండుగలో మొదటి రోజైన భోగి ప్రత్యేకమైంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పార్టీల నాయకులు భోగి సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం సూర్యుడు మకరరాశిలోకి వెళ్లే ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటారు.

Chandrababu Burnt GO.no.1 Papers : భోగి మంటల్లో జీవో నెం.1 కాపీలను దగ్ధం చేసిన చంద్రబాబు

దీని ద్వారా చలికి గుడ్ బై చెబుతారు. భోగి మంటల్లో ఇళ్లలోని పాత వస్తువులు, విరిగి పోయిన మంచాలు, కుర్చీలు, వాడని వాటిని వేశారు. భోగి నుంచి ఇళ్లలో పండుగ కళ వచ్చింది. తెలుగు లోగిళ్లు సరికొత్తగా కళకళలాడుతున్నాయి. బంధువులు, స్నేహితులతో తెలుగు పల్లెల్లో నాలుగు రోజులు పండుగ వాతావరణం నెలకొంది.