AP DSC Candidates : 2008 డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త..

ఏపీలో 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2,193 మంది డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థులను కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా నియమిస్తూ సోమవారం (జూన్ 21) ఉత్తర్వులు జారీ అయ్యాయి.

AP DSC Candidates : 2008 డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త..

Good News For 2008 Dsc Candidates

AP 2008 DSC Candidates : ఏపీలో 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2,193 మంది డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థులను కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా నియమిస్తూ సోమవారం (జూన్ 21) ఉత్తర్వులు జారీ అయ్యాయి. 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరుగుతోంది. ఎస్జీటీలుగా మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ వర్తింపుజేయనుంది.

టీడీపీ హయాంలో డీఎస్సీ అభ్యర్థుల విషయంలో పట్టించుకోలేదని, వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తున్నట్టు ఇటివలే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. మానవతా దృక్పథంతో డీఎస్సీ అభ్యర్ధుల సమస్యను పరిష్కరించినట్టు చెప్పారు. ‘డీఎస్సీ-2008’ సమస్య 13 ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉందన్నారు. అభ్యర్థుల భవితవ్యంపై సీఎం వైఎస్‌ జగన్‌ మానవతా దృక్పథంతో వ్యవహరించారని తెలిపారు.

వాస్తవానికి.. డీఎస్సీ 2008 అభ్యర్ధుల అంశం చాలాకాలంగా అపరిష్కృతంగా ఉంది. డీఎస్సీలో మెరిట్ పాటించకపోవడంతో చాలామంది అభ్యర్ధులు నష్టపోయారు. దీనిపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ కె వెంకట్రామిరెడ్డి సీఎం జగన్‌ను కలిసి సమస్యను విన్నవించారు. డీఎస్సీ 2008లో నష్టపోయిన అభ్యర్ధులకు కాంట్రాక్టు పద్ధతిలో టీచర్లుగా నియమిస్తామని సీఎం జగన్ చెప్పారని అన్నారు. ఇప్పటికే వీరిలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరికి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్‌లో మినహాయించాలని సీఎంను కోరారు.