Employees Health Scheme : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆరోగ్యశ్రీ తరహాలోనే ఈహెచ్ఎస్

ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆరోగ్యశ్రీ తరహాలోనే ప్రభుత్వ ఉద్యోగులు.. ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్ ‌(ఈహెచ్ఎస్) కార్డు ద్వారా ఇతర రాష్ట్రాల్లోనూ వైద్య సేవలు పొందొచ్చు. ఈ మేరకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Employees Health Scheme : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆరోగ్యశ్రీ తరహాలోనే ఈహెచ్ఎస్

Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆరోగ్యశ్రీ తరహాలోనే ప్రభుత్వ ఉద్యోగులు.. ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్ ‌(ఈహెచ్ఎస్) కార్డు ద్వారా ఇతర రాష్ట్రాల్లోనూ వైద్య సేవలు పొందొచ్చు. ఈ మేరకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు ఈహెచ్ఎస్ లిస్టులో ఇప్పటివరకూ కవర్‌ కాని 565 వైద్య సేవలను ఉద్యోగులకు వర్తింపజేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే ఈహెచ్‌ఎస్‌ ద్వారా చికిత్స పొందిన వారి బిల్లులను.. ఆరోగ్యశ్రీ తరహాలోనే 21 రోజుల్లోనే ఆటోడెబిట్‌ స్కీమ్‌ ద్వారా చెల్లింపులకు అంగీకారం తెలిపింది. రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులూ ఇతర రాష్ట్రాల్లో ఈహెచ్‌ఎస్‌ కార్డుపై వైద్య సేవలు పొందేందుకు వీలుగా అనుమతి ఇచ్చింది ప్రభుతం.

మరోవైపు నెట్ వర్క్ ఆసుపత్రుల్లో EHS కార్డుల సమన్వయం కోసం ఆరోగ్యమిత్రలకు విధి విధానాలు జారీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇటీవల ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన మంత్రుల కమిటీ సమావేశం అనంతరం ఉద్యోగులకు సంబంధించిన ఈహెచ్‌ఎస్‌పై ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.