APSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ‘కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ’ ప్రకటన!
ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులను ఇప్పటికే ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ ప్రభుత్వం తాజాగా మరో తీపి కబురు అందించింది.

APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులను ఇప్పటికే ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ ప్రభుత్వం తాజాగా మరో తీపి కబురు అందించింది. ఆర్టీసీ ఉద్యోగుల బీమాకు సంబంధించి ‘కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ’ని ప్రకటించింది. ఇందులో ఉచిత ప్రమాద బీమా, శాశ్వత అంగవైకల్యం, సహజ మరణం సంభవించినప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను ఆర్థికంగా ఆదుకునేందుకు భారీ పరిహారంతో ప్యాకేజీని ప్రవేశపెట్టడంతో పాటు మరణించిన ఉద్యోగుల పిల్లల విద్యారుణాలు, ఆడపిల్లల వివాహ రుణాల మాఫీ కూడా కల్పించనున్నారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో పోలీసు శాఖలో ఈ తరహా ‘కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ’ని అమలు చేస్తుండగా.. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు కూడా కల్పించింది. ఇందుకోసం ఆర్టీసీ తమ ఉద్యోగులకు జీతాలను చెల్లించే ఖాతాలు కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే ప్రభుత్వం దీనిపై మరింత విపులంగా విధివిధానాలను రూపకల్పన చేయనుంది. ఈ కార్పొరేట్ శాలరీ ప్యాకేజీతో రాష్ట్రంలో 50 వేల 500 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.
ఇప్పటి వరకు ఆర్టీసీ ఉద్యోగి విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి రూ.30 లక్షలు పరిహారం ఇచ్చేవారు. కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ అమలుతో ఇప్పుడు రూ.10 లక్షలు పెంచి రూ.40 లక్షల పరిహారం చెల్లిస్తారు. ప్రమాదంలో గాయపడి శాశ్వత వైకల్యానికి గురైతే రూ.30 లక్షల పరిహారం చెల్లించనున్నారు. ఉద్యోగుల పిల్లల పేరిట రూ.5 లక్షల విద్యారుణాలు, ఆడపిల్లల వివాహాల కోసం చేసిన రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేయనుండగా వీటికి ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగి సహజ మరణానికి రూ.5 లక్షల బీమా పరిహారం చెల్లించనుండగా ఇందుకు ఉద్యోగి నెలకు రూ.200 బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
- APSRTC Employees : సమ్మెలో పాల్గొనడం లేదు : ఆర్టీసీ ఉద్యోగులు
- RTC Strike : ఏపీలో ఆర్టీసీ సమ్మె సైరన్.. 6వ తేదీ అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్..!
- Mobile Recharge Plans : ఇకపై 28 రోజులు కాదు.. 30 రోజులు, మొబైల్ ప్రీపెయిడ్ ప్యాక్ వ్యాలిడిటీ పెంచాలని ట్రాయ్ ఆదేశం
- Amazon Sale: స్మార్ట్ఫోన్లు, టీవీలపై 40శాతం డిస్కౌంట్.. ఆఫర్ జనవరి 10 వరకు!
- Ap Employees: సంక్రాంతికి ఏపీ సీఎం గుడ్‌న్యూస్.. ఉద్యోగులకు 23శాతం ఫిట్మెంట్
1Sambhaji Nagar: ఔరంగబాద్ కాదు.. శంభాజీ నగర్!
2Karnataka Police : కారణం చెప్పకుండా.. సంకెళ్లు వేయడం చట్ట వ్యతిరేకం
3Maharashtra CM: ‘మహా’ సీఎంగా ఫడ్నవీస్.. రేపే ప్రమాణ స్వీకారం?
4Salma Khan : దేవిశ్రీని పక్కన పెట్టేసిన సల్లూ భాయ్.. KGF మ్యూజిక్ డైరెక్టర్ కి ఛాన్స్..
5Uddhav Thackeray: ఉద్ధవ్ ఠాకరే రాజీనామా మాకు సంతోషాన్నివ్వలేదు – రెబల్ ఎమ్మెల్యే
6Anasuya : జబర్దస్త్‌కి వరుస ఝలక్‌లు.. అనసూయ కూడా గుడ్‌బై??
7Shivya Pathania : నాతో కాంప్రమైజ్ అయితే స్టార్ హీరో పక్కన ఛాన్స్ అన్నాడు.. కాస్టింగ్ కౌచ్‌పై బుల్లితెర నటి..
8Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
9Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
10Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
-
TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్
-
Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
-
Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
-
Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?
-
Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
-
Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!