ఏపీలో పెన్షనర్లకు గుడ్ న్యూస్‌… కోత విధించిన పెన్షన్లు చెల్లింపు

  • Published By: bheemraj ,Published On : November 19, 2020 / 08:48 AM IST
ఏపీలో పెన్షనర్లకు గుడ్ న్యూస్‌… కోత విధించిన పెన్షన్లు చెల్లింపు

AP pensioners Good news : ఏపీలో పెన్షనర్లకు సీఎం వైఎస్‌ జగన్‌ తీపికబురు అందించారు. కరోనా వైరస్ నేపథ్యంలో వారి పెన్షన్లలో విధించిన కోతను మళ్లీ చెల్లించనున్నారు. ఆ నిధులను రెండు వాయిదాల్లో చెల్లించేందుకు ఆర్థిక శాఖ సిద్ధమైంది. డిసెంబర్ 1న పెన్షన్‌తో పాటు 50 శాతం డబ్బులను చెల్లిస్తారు. ఆ తర్వాత మిగిలిన 50 శాతం డబ్బులను చెల్లిస్తారు.



కరోనా వైరస్ నేపథ్యంలో ఏప్రిల్, మే నెలలకు సంబంధించి పెన్షనర్లకు చెల్లించే పెన్షన్లను ప్రభుత్వం కట్ చేసింది. ఆ డబ్బులను ఇప్పుడు చెల్లించనుంది. మరోవైపు డీఏ పెంపుపై ఏపీ ప్రభుత్వం వారం క్రితం ఉత్తర్వులు విడుదల చేసింది. 2018 జులైలో పెంచిన 3.144 శాతం కరువు భత్యం మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది.



https://10tv.in/ap-assembly-meetings-begin-from-november-30-2020/
దీంతో కరువు భత్యం 27.248 నుంచి 30.392కు పెరిగినట్లయింది. 2021 జనవరి జీతాలతో కలిపి ఈ డబ్బు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు.. 2018, జులై 1 నుంచి 2020 డిసెంబర్ 31 వరకు 30 నెలల బకాయిలను 3 సమ భాగాల్లో పీఎఫ్‌ ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించింది.