Gorantla Madhav Video: గోరంట్ల వీడియో నిజమైనదే.. అమెరికన్ ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చిందన్న టీడీపీ

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో నిజమైనదేనని, అందులో ఎలాంటి ఎడిటింగ్, మార్ఫింగ్ వంటివి జరగలేదని అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చినట్లు టీడీపీ ప్రకటించింది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు.

Gorantla Madhav Video: గోరంట్ల వీడియో నిజమైనదే.. అమెరికన్ ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చిందన్న టీడీపీ

Gorantla Madhav Video: ఇటీవల లీకైన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో నిజమైనదేనని తమ ప్రైవేటు ఫోరెన్సిక్ విచారణలో తేలిందని టీడీపీ ప్రకటించింది. అందులో ఎలాంటి ఎడిటింగ్, మార్ఫింగ్ వంటివి లేదని అమెరికన్ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇచ్చినట్లు టీడీపీ నేతలు వెల్లడించారు. ఈ అంశంపై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి శనివారం మీడియాతో మాట్లాడారు.

Karnataka: అధికారులతో గడిపితేనే మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలు.. కర్ణాటక ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత ఆరోపణ

అమెరికాకు చెందిన ఎక్లిప్స్ అనే ఒక ప్రైవేటు ఫోరెన్సిక్ సంస్థతో వీడియోపై విచారణ చేయించినట్లు చెప్పారు. ఆ వీడియోను పరిశీలించిన ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన వివరాల్ని పట్టాభి బహిర్గతం చేశారు. ఆ సంస్థ ఇచ్చిన రిజల్ట్ కాపీని కూడా ఆయన మీడియాకు విడుదల చేశారు. వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవేనని, అందులో ఎలాంటి మార్ఫింగ్, ఎడిటింగ్ జరగలేదని తేలిందని పట్టాభి అన్నారు. ‘‘వీడియోలో మార్ఫింగ్ జరగలేదనడానికి జగన్ మోహన్ రెడ్డికి ఇంతకంటే సాక్ష్యాలు కావాలా? నిస్సిగ్గుగా ఇంకా జగన్ మోహన్ రెడ్డి ఎంపీని వెనకేసుకొస్తున్నారు. రాష్ట్ర మహిళలకు ఇప్పుడేం సమాధానం చెబుతారు. ఎంపీ పదవిలో ఇక నిమిషం కూడా కొనసాగే అర్హత గోరంట్ల మాధవ్ కోల్పోయారు. ఎంపీ గోరంట్ల వీడియో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినా ఉపయోగం లేదని ప్రభుత్వం చెప్పడం పచ్చి అబద్ధం. ఎంపీపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోకపోగా, వెనకేసుకొస్తే రాష్ట్రంలో ఇక మహిళలు ఎలా ధైర్యంగా తిరగగలరు’’ అని పట్టాభి వ్యాఖ్యానించారు.

Chinese Manjha: సోదరి ఇంటికి వెళ్తూ.. చైనా మాంజా గొంతుకు చుట్టుకుని యువకుడి మృతి

ఇదే అంశంపై తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా మాట్లాడారు. ‘‘మేం బయటపెట్టిన ఫోరెన్సిక్ నివేదికపై చర్చించే దమ్ము, ధైర్యం ప్రభుత్వంలో ఎవరికైనా ఉందా? చేసిన గలీజు పనికి చర్యలు తీసుకోకపోగా, కులాన్ని లాగడం దుర్మార్గం. తప్పు చేసిన వారిని శిక్షించాల్సింది పోయి, అతడిని రక్షించేందుకు పోలీసులు, ప్రభుత్వం ప్రయత్నించడం చూసి రాష్ట్ర మహిళలంతా సిగ్గుతో తల దించుకుంటున్నారు. మనిషైతే చేసిన పనికి గోరంట్ల మాధవ్ సిగ్గుపడాలి. ఆయనపై తదుపరి చర్యలేంటో సీఎం అయినా చెప్పాలి. మా వద్ద ఉన్న ఫోరెన్సిక్ నివేదికతో ప్రధాని, రాష్ట్రపతి, ఇతర రాజ్యాంగ పెద్దలను కలుస్తాం. గోరంట్ల మళ్లీ పార్లమెంటులో అడుగుపెట్టకుండా పోరాడుతాం’’ అని వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు.

Message from space: స్వాతంత్ర వజ్రోత్సవ వేళ.. అంతరిక్షం నుంచి భారత్‌కు సందేశం

ఇక, ఎక్లిప్స్ ఫోరెన్సిక్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 9న పోతిని అనే వ్యక్తి ఈ వీడియోను పరిశీలించమని ఆ సంస్థను కోరారు. దీన్ని పరిశీలించిన తర్వాత ఆ వీడియోలో ఎలాంటి ఎడిటింగ్ వంటివి జరగలేదని తేల్చింది. ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న ఈ సంస్థ ఈ ఏడాదిలోనే దాదాపు 40కిపైగా కేసుల్ని పరిశీలించింది. జిమ్ స్టాన్‌ఫోర్డ్ అనే నిపుణుడు ఈ వీడియోను పరిశీలించారు.