Bopparaju Venkateswarlu : యధావిధిగా ఉద్యోగ సంఘాల ఉద్యమ కార్యాచరణ-ఏపీ జేఏసీ అమరావతి కీలక ప్రకటన

ఉద్యోగ సంఘాల ఉద్యమ కార్యాచరణపై కీలక ప్రకటన చేశారు ఏపీ జేఏసీ అమరావతి కన్వీనర్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఉద్యోగ సంఘాల ఉద్యమ కార్యాచరణ యధావిధిగా ఉంటుందన్నారు. చిన్న చిన్న మార్పులతో ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఉద్యోగుల ఆర్ధిక, ఆర్థికేతర సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం, మంత్రులు చెప్పడం జరిగిందని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

Bopparaju Venkateswarlu : యధావిధిగా ఉద్యోగ సంఘాల ఉద్యమ కార్యాచరణ-ఏపీ జేఏసీ అమరావతి కీలక ప్రకటన

Bopparaju Venkateswarlu : ఉద్యోగ సంఘాల ఉద్యమ కార్యాచరణపై కీలక ప్రకటన చేశారు ఏపీ జేఏసీ అమరావతి కన్వీనర్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఉద్యోగ సంఘాల ఉద్యమ కార్యాచరణ యధావిధిగా ఉంటుందన్నారు. చిన్న చిన్న మార్పులతో ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఉద్యోగుల ఆర్ధిక, ఆర్థికేతర సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం, మంత్రులు చెప్పడం జరిగిందని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

Also Read..Anakapalle Lok Sabha Constituency : పేరు మాత్రం సాఫ్ట్…రాజకీయం మాత్రం మస్త్ హాట్…అనకాపల్లిలో పోటాపోటీగా పొలిటికల్ వార్

మేమిచ్చిన వినతిపత్రంపై చర్చ చేయకుండా పాత సమస్యలపై మాట్లాడుతున్నారని చెప్పారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. చట్టబద్ధంగా ఉద్యోగులకు రావాల్సిన రూ.2 వేల కోట్లు సెప్టెంబర్ లోపు చెల్లిస్తామన్నారు. డీఏ, అరియర్స్ ఎంత ఇవ్వాలి అన్నది స్పష్టత లేదన్నారు.(Bopparaju Venkateswarlu)

Also Read..AP Government: 31లోగా బకాయిలన్నీ క్లియర్ అవుతాయి: కేబినెట్ సబ్ కమిటీ భేటీ తర్వాత ఏపీ సర్కారు ప్రకటన

” మేము చెప్పిన అంశాలపై చర్చ లేకుండా వాళ్లు చెప్పాలనుకున్నవి చెప్పి వెళ్లిపోయారు. 11వ పీఆర్సీ, పే స్కెల్ పై స్పష్టత లేదు. అసలు ఎంతుందో చెప్పాలి. పీఆర్సీ అరియర్స్ ఎంత బకాయిలు ఉన్నాయో చెప్పాలి. జీతాలు ప్రతి నెల 1వ తారీకునే ఇవ్వాలని కోరినా మంత్రుల కమిటీ స్పందించ లేదు. సీపీఎస్ ఉద్యోగుల 1300 కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వాలి.

ఏప్రిల్ నుంచి జీపీఎస్ కు సంబంధించిన ఉద్యోగులకు సమాచారం రావడం లేదు. ప్రభుత్వం నెలాఖరులోగా ఇస్తామని చెప్పినా ఉద్యోగులకు నమ్మకం లేదు. సీపీఎస్ రద్దు అంటుంటే జీపీఎస్ అంటున్నారు. పాత పెన్షన్ తప్ప ఇతర ఏది తీసుకొచ్చినా మేము అంగీకరించేది లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేస్తామని మీరే హామీ ఇచ్చారు. అమలు చేయాలని అడుగుతుంటే స్పందన లేదు.(Bopparaju Venkateswarlu)

Also Read..Bopparaju Venkateshwarlu : ఉద్యోగ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్త ఆందోళన : బొప్పరాజు వెంకటేశ్వర్లు

ఈరోజు నుంచి ఉద్యమ కార్యాచరణను చిన్న చిన్న మార్పులు చేసి కొనసాగిస్తున్నాం. ఈరోజు నుంచి వచ్చే నెల5 వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతాo. ఈ నెల 17, 20వ తేదీల్లో ప్రభుత్వ కార్యాలయాల సందర్శన. 21 నుంచి వర్క్ రూల్ కొనసాగుతుంది. 26న కారుణ్య నియామకాలు కుటుంబాల సందర్శన యాత్ర. వచ్చే నెల 5వ తేదీన రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించి మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఇతర ఉద్యోగ సంఘాల నేతలు ఆలోచించి ఉద్యమంలో కలిసి రావాలి” అని ఏపీ జేఏసీ అమరావతి కన్వీనర్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

Also Read..Andhra Pradesh : పౌరుషాల పురిటిగడ్డ పల్నాడులో హీటెక్కుతున్న రాజకీయం .. టీడీపీ ట్రిక్సేంటీ? జనసేన జోరెంత? వైసీపీ వైఖరేంటీ..?