Bendapudi High School Students : ఇంగ్లీష్‌లో అదరగొట్టిన ప్రభుత్వ పాఠశాల పిల్లలు.. సీఎం జగన్ ఫిదా

ఎలాంటి తడబాటు లేకుండా జగన్ తో ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడారు. అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియంలో బోధన, నాడు-నేడు విశిష్టతను వివరించారు.(Bendapudi High School Students)

Bendapudi High School Students : ఇంగ్లీష్‌లో అదరగొట్టిన ప్రభుత్వ పాఠశాల పిల్లలు.. సీఎం జగన్ ఫిదా

Governmentschool Students Amazing English (2)

Bendapudi High School Students: సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలు అంటే చాలా మందికి చిన్న చూపు ఉంది. సర్కారీ బడుల్లో చదువు సరిగా చెప్పరని, నాణ్యమైన విద్య ఉండదని, టీచర్లు సరిగా రారని, ఇంగ్లీష్ లో వెనుకబడిపోతారని, క్లాసులు సరిగా నిర్వహించరనే అభిప్రాయాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే, ఆ అభిప్రాయాల్లో నిజం లేదని, అవి కేవలం అపోహలు మాత్రమే అని ఏపీలోని గవర్నమెంట్ స్కూల్ పిల్లలు నిరూపించారు. ముఖ్యంగా ఇంగ్లీష్ లో వారు ఇరగదీశారు. ఫారిన్ యాక్సెంట్ లో ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడి అందరినీ అబ్బురపరిచారు. ఏకంగా సీఎం జగన్ ముందే ఇంగ్లీష్ స్పీచ్ ఇచ్చి అదరగొట్టారు. వారి ప్రతిభ ఏ రేంజ్ లో ఉందంటే, సీఎం జగన్.. ఆ పిల్లల ఇంగ్లీష్ స్పీచ్ కి ఫిదా అయిపోయారు. శభాష్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

Governmentschool Students Amazing English (1)

Governmentschool Students Amazing English (1)

కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు ఆంగ్లంలో అద్భుతంగా మాట్లాడుతున్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది తెలుసుకున్న సీఎం జగన్.. ఆ పిల్లలను ప్రత్యేకంగా పిలిపించారు. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం.. అధికారులు ముందే విద్యార్థులతో మాట్లాడారు. సీఎం జగన్, పిల్లల సంభాషణ దాదాపుగా ఇంగ్లీష్ లోనే సాగింది. తాను తెలుగు మీడియంలో చదివానని, అయితే తాను ఎదుర్కొన్న సమస్య పిల్లలకు ఎదురుకాకూడదని ఇంగ్లీష్ లో ప్రజ్ఞ సాధించే విధంగా చూశామని పిల్లల ఇంగ్లీష్ టీచర్ చెప్పారు.

బెండపూడి ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు గురువారం సీఎం జగన్ ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. జగన్ ముందు కూర్చుని ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. వారు ఎలాంటి తడబాటు లేకుండా సీఎం జగన్ తో ఇంగ్లీషులో మాట్లాడడం విశేషం. అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియంలో బోధన, నాడు-నేడు పథకాల విశిష్టతను పిల్లలు ఇంగ్లీష్ లో చక్కగా వివరించారు.(Bendapudi High School Students)

Nandyal : నన్ను ఎవరూ పీకలేరు..ప్రతిపక్షాలపై సీఎం జగన్ ఫైర్

ఇలాంటి కార్యక్రమాలతో, పథకాలతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచారంటూ సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంగ్లీష్ మీడియం విద్యాబోధనతో ఎంతో మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతోందన్నారు. ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోకుండా, ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ఎంతో లబ్ది చేకూరుతోందని పిల్లలు సీఎం జగన్ తో చెప్పారు.

English

English

ప్రభుత్వ పథకాలు, వాటి వల్ల విద్యార్థులకు జరుగుతున్న మేలు గురించి పిల్లలు వివరిస్తుంటే.. సీఎం జగన్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ముఖ్యంగా, ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడడం ఆయనను అమితానందానికి గురిచేసింది. వారి ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని ఆద్యంతం చిరునవ్వుతో ఆస్వాదించిన సీఎం, ఆ విద్యార్థులను మనస్ఫూర్తిగా అభినందించారు.((Bendapudi High School Students))

Nadu Nedu (1)

Nadu Nedu (1)

కాగా, ఏపీలో విద్యా వ్యవస్థ సంస్కరణలకు జగన్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన వంటి పథకాలు, విద్యార్థుల తల్లుల ఖతాలో నగదు జమ చేసే అమ్మ ఒడి పథకాలు అమలు చేస్తోంది. విద్యార్థులకు మనం ఇచ్చే ఏకైక ఆస్తి చదువు మాత్రమే, పిల్లల జీవితాల్లో వెలుగులు నింపేది విద్యా మాత్రమే అని పదే పదే చెప్పే జగన్.. పిల్లలకు నాణ్యమైన చదువు అందించే విషయంలో రాజీపడకూడదని నిర్ణయిచారు. అందులో భాగంగానే నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన తీసుకొచ్చారు. ఇక, పేదరికం చదువుకి అడ్డుకాకూదని, ప్రతి పిల్లాడు చదువుకోవాలనే ఉద్దేశ్యంతో అమ్మఒడి స్కీమ్ తీసుకొచ్చారు జగన్.

మంత్రిని మెచ్చుకున్న సీఎం జగన్ : ఇంగ్లీష్ మీడియం అమలు ఇలా