అసలేం జరిగింది, మిస్టరీగా మారిన ప్రభుత్వ టీచర్ ఆత్మహత్య

ఆవిడో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. వయసు 50 ఏళ్లకు పైబడే ఉంటుంది. ఏం జరిగిందో ఏమో కానీ ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుంది.

  • Published By: veegamteam ,Published On : March 12, 2020 / 10:37 AM IST
అసలేం జరిగింది, మిస్టరీగా మారిన ప్రభుత్వ టీచర్ ఆత్మహత్య

ఆవిడో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. వయసు 50 ఏళ్లకు పైబడే ఉంటుంది. ఏం జరిగిందో ఏమో కానీ ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుంది.

ఆవిడో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. వయసు 50 ఏళ్లకు పైబడే ఉంటుంది. ఏం జరిగిందో ఏమో కానీ ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుంది. తెల్లవారే సరికి విగతజీవిగా మారింది. మరి ఆ మహిళ ఆత్మహత్య వెనుక మిస్టరీ ఏంటి..? ఆత్మహత్య చేసుకునే సమయంలో ఇంట్లో ఎవరూ లేరా..? పనిమనిషి వచ్చేంత వరకు విషయం బయటకు ఎందుకు రాలేదు..? 

జూలూరు గ్రామ హైస్కూల్‌లో ఉపాధ్యాయురాలు:
ఆమె పేరు నాగమణి. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జూలూరు గ్రామ హైస్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పని చేసేది. కంచికచెర్ల జుజ్జూరు రోడ్డు పాములపాటి వారి వీధిలో నివాసముంటూ జీవనం సాగించేది. సీన్‌ కట్‌ చేస్తే…ఉదయం నాగమణి ఇంట్లో పని చేసే మహిళ..ఎప్పటిలాగే వచ్చింది. గేటు తీసుకుని ఇంట్లోకి వెళ్లింది. అంతే అక్కడి ఘటనను చూసి షాక్‌కు గురైంది. తన యజమానురాలు కాలిపోయిన స్థితిలో ఉండటం చూసి..గట్టిగా కేకలు వేసింది. స్థానికులు పరుగెత్తుకొచ్చారు. ఏం జరిగిందంటూ చర్చించుకునే పనిలో పడ్డారు.

కలకలం రేపిన టీచర్ ఆత్మహత్య:
ఆ కాసేపటికే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. డెడ్‌బాడీ పక్కనే పెట్రోల్‌ బాటిల్‌ ఉండటం చూసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతరం పూర్తిగా కాలిన స్థితిలో ఉన్న నాగమణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక మృతురాలికి సంబంధించి వివరాలను..పని మనిషితో పాటు స్థానికులను అడిగి తెలుసుకున్నారు పోలీసులు. ఆ మహిళకు ఎలాంటి సమస్యలు లేవని వారంతా చెప్పారు.

ఒంటినిండా మంటలు వ్యాపించినా.. ఎందుకు అరవలేదు?
మరి ఏ సమస్యలు లేనప్పుడు ఆత్మహత్య ఎందుకు చేసుకుంది..? ఆత్మహత్య చేసుకునే సమయంలో ఇంట్లో ఎవరూ లేరా..? పెట్రోల్‌ ఎక్కడి నుంచి తెచ్చుకుంది..? మాములుగా మంట వేడి తగిలితేనే తట్టుకోలేం. మరి ఒంటినిండా మంటలు వ్యాపించినా..ఆ మహిళ ఎందుకు అరవలేదు..? ఈ సూసైడ్‌ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇప్పుడి కోణంలోనే దర్యాప్తు చేపట్టారు.

See Also | కరోనా ఎఫెక్ట్….IPL 2020 రద్దు!