Narayana Swamy: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి శాఖ తొలగింపు

డిప్యూటీ సీఎం నారాయణ స్వామి శాఖల్లో కోత విధించింది ప్రభుత్వం.

Narayana Swamy: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి శాఖ తొలగింపు

Narayana swamy

Narayana Swamy: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి శాఖల్లో కోత విధించింది ప్రభుత్వం. వాణిజ్య పన్నుల శాఖను నారాయణ స్వామి నుంచి తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. వాణిజ్య పన్నుల శాఖను ఆర్థిక మంత్రి బుగ్గనకు అప్పగించింది.

ఎక్సైజ్ శాఖకే నారాయణస్వామిని పరిమితం చేస్తూ.. వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలను ఆర్ధిక శాఖ పరిధిలోకి తీసుకుని వచ్చింది ప్రభుత్వం.

గతంలోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కార్యరూపం దాల్చలేదు.. ఎట్టకేలకు అప్పటి ప్రతిపాదలను ఇప్పుడు అమల్లోకి తీసుకుని వచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు గెజిట్ విడుదల చేసింది.

త్వరలోనే మరో డెప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ నుంచి కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖను తప్పించే అవకాశం కనిపిస్తుంది. ఈ శాఖను కూడా ఆర్థిక శాఖ పరిధిలోకి తీసుకుని వచ్చింది ప్రభుత్వం.

ఈ శాఖలను బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కేటాయించింది ప్రభుత్వం. ఇప్పటికే ఆర్థిక, ప్రణాళిక, శాసనసభా వ్యవహారాలను బుగ్గన చూస్తుండగా.. మరో రెండు శాఖలను బుగ్గనే నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది.