జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థులను ఏపీలోకి అనుమతించాలని నిర్ణయం

ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌ మధ్య సంప్రదింపులు జరిగాయి. జగ్గయ్యపేట వద్ద ప్రస్తుతం వేచిచూస్తున్న ఏపీ వారికి హెల్త్‌ ప్రోటోకాల్‌ పాటించి రాష్ట్రంలోకి అనుమతించాలని నిర్ణయించారు. 

  • Published By: veegamteam ,Published On : March 25, 2020 / 07:17 PM IST
జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థులను ఏపీలోకి అనుమతించాలని నిర్ణయం

ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌ మధ్య సంప్రదింపులు జరిగాయి. జగ్గయ్యపేట వద్ద ప్రస్తుతం వేచిచూస్తున్న ఏపీ వారికి హెల్త్‌ ప్రోటోకాల్‌ పాటించి రాష్ట్రంలోకి అనుమతించాలని నిర్ణయించారు. 

ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌ మధ్య సంప్రదింపులు జరిగాయి. కోవిడ్‌–19 నివారణలో భాగంగా ప్రస్తుతం ఎక్కడి వారిని అక్కడే ఉండేట్టుగా చూడాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే జగ్గయ్యపేట వద్ద ప్రస్తుతం వేచిచూస్తున్న ఏపీ వారికి హెల్త్‌ ప్రోటోకాల్‌ పాటించి రాష్ట్రంలోకి అనుమతించాలని నిర్ణయించారు. 

ఇక హైదరాబాద్‌ నుంచి ఎవ్వరు వచ్చినా అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇలా చేయడంవల్ల వారికేకాక, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా రిస్క్‌లో పెట్టినట్టే అవుతుందన్న అధికారులు అంటున్నారు. దయచేసి ఎక్కడివారు అక్కడే ఉండాలని ఏపీ అధికారులు కోరుతున్నారు. హాస్టళ్లు, పీజీ మెస్‌లు మూసివేయవద్దంటూ ఇదివరకే తెలంగాణ ప్రభుత్వం, మంత్రుల ఆదేశాలు జారీ చేశారు. 

ఆంధ్రప్రదేశ్ సీఎం నుంచి పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ఇప్పుడు అక్కడ స్పాట్ లో ఉన్న వారందరినీ ఏపీలోకి అనుమతిస్తారు. అయితే మెడికల్ ప్రోటోకాల్ పాటించి మాత్రమే అనుమతిస్తారు. కొత్తగా ఎవర్ని అనుమతించరు. ఈరోజు అక్కడ ఉన్న వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

హైదరాబాద్ లో హాస్టళ్ల మూసివేయడంతో విద్యార్థులు ఏపీ బాట పట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్ వోసీతో విద్యార్థులు బయల్దేరారు. అంతకముందు పోలీసులు విద్యార్థులను ఏపీలోకి అనుమతించలేదు. ఏపీ, తెలంగాణ బోర్డర్ లో విద్యార్థులు అగచాట్లు పడ్డారు. ఏపీ, తెలంగాణ బోర్డర్ గరిపాడు చెక్ పోస్టు వద్ద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిబంధనల మధ్య నలిగిపోయారు.

చెక్ పోస్టు దగ్గర ఏడు గంటలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏపీలోకి అడుగు పెట్టలేక, తెలంగాణకు తిరిగి వెళ్లలేక అవస్థలు పడ్డారు. ఎటు వెళ్లాలో తెలియక విద్యార్థులు సతమతం అయ్యారు. 

ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌ మధ్య సంప్రదింపులు జరిగాయి. కోవిడ్‌–19 నివారణలో భాగంగా ప్రస్తుతం ఎక్కడి వారిని అక్కడే ఉండేట్టుగా చూడాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే జగ్గయ్యపేట వద్ద ప్రస్తుతం వేచిచూస్తున్న ఏపీ వారికి హెల్త్‌ ప్రోటోకాల్‌ పాటించి రాష్ట్రంలోకి అనుమతించాలని నిర్ణయించారు. 

Also Read | అమెరికా నుంచి వచ్చిన యువకుడికి కరోనా…ఏపీలో 10కి పెరిగిన కేసులు