తిరుమలలో సామూహిక వివాహాలకు గ్రీన్ సిగ్నల్, పెరుగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో సామూహిక వివాహాలకు గ్రీన్ సిగ్నల్, పెరుగుతున్న భక్తుల రద్దీ

weddings in Tirumala, : కరోనా వల్ల ఆగిపోయిన తిరుమలలోని సామూహిక వివాహాలు త్వరలో ప్రారంభంకానున్నాయి‌. తిరుమల పాపనాశనం రోడ్డులోని కళ్యాణ వేదికలో త్వరలోనే సామూహిక వివాహాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది టీటీడీ. భక్తుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఆన్లైన్ ద్వారా సామూహిక వివాహాలతో పాటు చెవిపోగులు కుట్టించుకోవడానికి కూడా అనుమతించనుంది.
కరోనా కారణంగా..ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే.

ఈ వైరస్ ఎఫెక్ట్ దేవాలయాలపై కూడా పడింది. కొన్ని రోజుల పాటు ఆలయాలను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుమలో కూడా ఆంక్షలు, నిబంధనలు అమలు చేశారు. భక్తులను అనుమతించలేదు. ప్రస్తుతం వైరస్ తగ్గుముఖం పడుతుండడం, వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో దేవాలయాల్లో రద్దీ కనబడుతోంది. కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. చాలా రోజుల తర్వాత..శ్రీ వారి హుండి ఆదాయం పెరుగుతోంది. భారీగానే..భక్తులు శ్రీ వారికి తలనీలాలు సమర్పిస్తున్నారు. టీటీడీ పరిస్థితిని సమీక్షిస్తూ..క్రమంగా పలు నిర్ణయాలు తీసుకొంటోంది. రూ. 300 ప్రత్యేక దర్శనంతో పాటు..సర్వ దర్శనం టోకెన్లు కూడా జారీ చేస్తుండడంతో భక్తుల సంఖ్య అధికంగా పెరుగుతోంది.