Groom Deceased: మూడు రోజుల్లో పెళ్లి..పెళ్లి కుమారుడు మృతి.

మరో మూడు రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా విషాదం చోటుచేసుకుంది. పెళ్లి కుమారుడు కరోనాతో మృతి చెందాడు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే చింతపల్లి మండలం రాకోట గ్రామానికి చెందిన దేశగిరి రజనీకాంత్‌ (24)కు రోలుగుంట మండలం అర్ల గ్రామానికి చెందిన యువతికి పెళ్లి నిశ్చయం అయింది.

Groom Deceased: మూడు రోజుల్లో పెళ్లి..పెళ్లి కుమారుడు మృతి.

Groom Deceased

Groom Deceased: మరో మూడు రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా విషాదం చోటుచేసుకుంది. పెళ్లి కుమారుడు కరోనాతో మృతి చెందాడు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే చింతపల్లి మండలం రాకోట గ్రామానికి చెందిన దేశగిరి రజనీకాంత్‌ (24)కు రోలుగుంట మండలం అర్ల గ్రామానికి చెందిన యువతికి పెళ్లి నిశ్చయం అయింది. మే 26న ముహూర్తం ఖరారు చేశారు. రజనీకాంత్ పరవాడలో పోస్టల్‌ డిపార్టుమెంటులో ఉద్యోగం చేస్తున్నాడు.

పెళ్లి పనుల నిమిత్తం అటు ఇటు తిరిగాడు. ఈ నెల 13న వధువు ఊరు అర్ల గ్రామానికి వెళ్ళాడు. అప్పటికే జ్వరంతో ఇబ్బంది పడుతుండటం గమనించి ఆసుపత్రిలో చూపించుకోవాలని వధువు కుటుంబ సభ్యులు తెలిపారు. మరునాడు 14వ తేదీన ఫీల్డ్‌కు వచ్చిన హరిబాబు అనే హెల్త్‌ అసిస్టెంట్‌ రజనీకాంత్‌ పరిస్థితి తెలుసుకొని రూ. 15000 ఇస్తే పెద్దాసుపత్రికి వెళ్లే పనిలేకుండానే తాను నయం చేస్తానని భయపడాల్సిన పనిలేదని చెప్పాడు. రజనీకాంత్ దగ్గర రూ. 15000 తీసుకోని వైద్యం ప్రారంభించాడు. రెండు రోజుల తర్వాత అతడి ఆరోగ్యపరిస్థితి క్షిణించింది.

దీంతో నర్సీపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా పాజిటివ్ అని తేలడంతో అక్కడినుంచి విశాఖ జీజీహెచ్ కు తీసుకొచ్చారు. అప్పటికే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో రజనీకాంత్ పరిస్థితి విషమించింది. దీంతో అతడు శనివారం మృతి చెందాడు. పెళ్ళికి మూడు రోజుల ముందు వరుడు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముందుగానే టెస్ట్‌లు చేసి నిర్ధారించి తగిన చికిత్స అందించి ఉంటే తనను వివాహం చేసుకోవలసిన తన బావ బతికే వాడని పెళ్లి కుమార్తె, బంధువులు బోరున విలపిస్తున్నారు.