Gudivada Casino : గుడివాడ క్యాసినో రగడ.. టీడీపీ నిజనిర్థారణ కమిటీ పర్యటన

గుడివాడ క్యాసినో వ్యవహారం ఏపీ రాజకీయాల్లో వేడి పెంచింది. దీనిపై రచ్చ రచ్చ జరుగుతోంది. ప్రతిపక్షం టీడీపీ సీరియస్ గా తీసుకుంది.

Gudivada Casino : గుడివాడ క్యాసినో రగడ.. టీడీపీ నిజనిర్థారణ కమిటీ పర్యటన

Gudivada Casino

Gudivada Casino : గుడివాడ క్యాసినో వ్యవహారం ఏపీ రాజకీయాల్లో వేడి పెంచింది. దీనిపై రచ్చ రచ్చ జరుగుతోంది. గుడివాలో క్యాసినో నిర్వహించడాన్ని ప్రతిపక్షం టీడీపీ సీరియస్ గా తీసుకుంది. ఇందులో నిజానిజాలేంటో తేల్చే పనిలో పడింది. గుడివాడలో క్యాసినో అంశంపై నిజాలు రాబట్టేందుకు రేపు టీడీపీ నిజనిర్థారణ కమిటీ పర్యటిస్తుందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.

ఈ కమిటీలో నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బోండా ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, తంగిరాల సౌమ్య సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ గుడివాడలో పర్యటించి పూర్తి స్థాయి నివేదికను అధిష్టానానికి అందిస్తుంది. జగన్ ప్రభుత్వం.. జూదాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తోందని టీడీపీ నేతలు మండిపడ్డారు. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో యువతను పెడదోవ పట్టించేలా నీచమైన సంస్కృతిని రాష్ట్రంలో ప్రవేశపెట్టారని ధ్వజమెత్తారు.

Blood Clots : గుండె రక్త నాళాల్లో పూడికలు….ఎవరిలో ఎక్కువంటే?

రాష్ట్రంలో క్యాసినో సంస్కృతిపై రచ్చ కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్రాంతి సంబరాల సందర్భంగా గుడివాడలో క్యాసినో నిర్వహించారని, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టిస్తున్నారని వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేశాయి ప్రతిపక్షాలు.

కృష్ణా జిల్లా గుడివాడలో సంక్రాంతి పండక్కి క్యాసినో, జూదం నిర్వహించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్‌ సెంటర్ లో గోవాకు చెందిన క్యాసినో నిర్వాహకుల పర్యవేక్షణలో జూదం నిర్వహించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేసినోతో పాటూ డ్యాన్సులు, అసాంఘిక చర్యలకు తెరతీశారని చెబుతున్నారు.

గుడివాడలో సంక్రాంతి పండుగ వేళ జూదశాల నిర్వహణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. గుడివాడలో కేసినో, జూదం, పేకాట, అమ్మాయిలు, అసభ్యకర నృత్యాలు.. ఇలా అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని తెలుగు దేశం నాయకులు ఆరోపిస్తున్నారు. గోవా రాష్ట్రాన్ని మించేలా గుడివాడలో తతంగం సాగుతోందని చెబుతున్నారు.

Fever : జ్వరంతో బాధపడుతుంటే మాంసాహారం తినకూడదా?

గుడివాడలోని కే కన్వెన్షన్‌ సెంటర్‌లో క్యాసినో నిర్వహణకు సంబంధించి మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. జూదం, అమ్మాయిలతో అసభ్య నృత్యాల నిర్వహణ ద్వారా రూ.500 కోట్లు చేతులు మారాయని ఫిర్యాదులో ఆరోపించారు. అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ తెలుగు సంస్కృతిని దెబ్బతీసే చర్యలను పోలీసులు ఉపేక్షించటం తగదని హితవుపలికారు.

గుడివాడలో కే కన్వెన్షన్ సెంటర్ లో కోడిపందాలు, పేకాట శిబిరాలు, గుండాటతో పాటుగా ప్రత్యేకంగా క్యాసినో నిర్వహించారని… రూ. 10వేలు చెల్లిస్తేనే క్యాసినో లోకి నిర్వాహకులు అనుమతించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకంగా బౌన్సర్లను కూడా ఏర్పాటు చేసుకుని సంక్రాంతి సందర్భంగా చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు నిర్వహించారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.