Kidnapped Boy safe : కిడ్నాపైన బాలుడి ఆచూకీ లభ్యం-వివాహితతో సహా బాలుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

కృష్ణా జిల్లా గుడివాడలో 15 ఏళ్ల బాలుడు, 30 ఏళ్ల మహిళ అదృశ్యం కేసును టూ టౌన్ పోలీసులు చేధించారు.

Kidnapped Boy safe : కిడ్నాపైన బాలుడి ఆచూకీ లభ్యం-వివాహితతో సహా బాలుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Kidnapped Boy safe : కృష్ణా జిల్లా గుడివాడలో 15 ఏళ్ల బాలుడు, 30 ఏళ్ల మహిళ అదృశ్యం కేసును టూ టౌన్ పోలీసులు చేధించారు. ఈనెల 19 న కిడ్నాప్ కు గురైన బాలుడి ఆచూకీ లభ్యమయ్యింది. బాలుడ్ని, ఎదురింటి  వివాహిత మహిళే కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిందని నిర్ధారించుకున్న పోలీసులు సాంకేతిక సహాకారంతో వారు ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు.

హైదరాబాద్ బాలానగర్ లోని ఒక ఇంట్లో ఉన్న వివాహిత మహిళ, బాలుడ్ని గుర్తించి పట్టుకుని గుడివాడ తీసుకు  వచ్చారు. బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.  వివాహిత మహిళ స్వప్నపై ఫోక్సో యాక్ట్, కిడ్నాప్ కేసుల కింద కేసు నమోదు చేశారు.

నలుగురు పిల్లలు ఉన్న స్వప్న నెల రోజులుగా బాలుడితో  సన్నిహిత సంబంధం ఏర్పరచుకుందని సీఐ దుర్గారావు తెలిపారు. బాలుడితో శాశ్వతంగా కలిసి ఉండాలనే దురుద్దేశంతో మాయమాటలు చెప్పి అపహరించిందని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఇరువురిని గుర్తించినట్లు సీఐ దుర్గారావు వెల్లడించారు.

Also Read : Enforcement Directorate : హైదరాబాద్‌లో ఈడీ దాడులు కలకలం..ఒకేసారి 8 చోట్ల సోదాలు