అన్ లాక్ – 4 ఏపీ మార్గదర్శకాలు : 21 నుంచి 9, 10, ఇంటర్ విద్యార్థులు విద్యాలయాలకు వెళ్లేందుకు అనుమతి

  • Published By: madhu ,Published On : September 7, 2020 / 12:52 PM IST
అన్ లాక్ – 4 ఏపీ మార్గదర్శకాలు : 21 నుంచి 9, 10, ఇంటర్ విద్యార్థులు విద్యాలయాలకు వెళ్లేందుకు అనుమతి

ఏపీ రాష్ట్రంలో అన్ లాక్ – 4 మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కొన్నింటికి అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు 2020, సెప్టెంబర్ 07వ తేదీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 21వ తేదీ నుంచి 9 -10 తరగతుల విద్యార్థులు స్కూళ్లకు, ఇంటర్ స్టూడెంట్స్ కాలేజీలకు వెళ్లేందుకు అనుమతినిచ్చింది.



అయితే..దీనికి తల్లిదండ్రులు రాతపూర్వక అంగీకారం ఇవ్వాల్సి ఉంటుంది. అదే రోజు నుంచి పీజీ, పీహెచ్ డీ, విద్యార్థులు కళాశాలలకు వెళ్లవచ్చని తెలిపింది. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు 21 నుంచి తెరుచుకోవచ్చని తెలిపింది.




21వ తేదీ నుంచి నూరు మంది మించకుండా..సామాజిక, విద్య, స్కూల్స్, మతపరమైన పొలిటికల్ సమావేశాలకు అనుమతి.
20వ తేదీ నుంచి పెళ్లిళ్లకు 50 మంది మాత్రమే హాజరు కావాల్సి ఉంటుంది.
అంత్యక్రియలకు 20 మంది హాజరయ్యేందుకు అనుమతి.
సినిమా థియేటర్స్, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్ టైన్ మెంట్ పార్కులకు అనుమతి ఇవ్వలేదు.
21 నుంచి ఓపెన్ థియేటర్లు అనుమతి.

https://10tv.in/india-now-has-the-worlds-second-highest-number-of-covid-19-cases-tops-brazils-coronavirus-tally/