Home » Andhrapradesh » కాకినాడలో గుజరాతీ మహిళల రుబాబు..దారినపోయే వాళ్ల నుంచి బలవంతపు వసూళ్లు
Publish Date - 6:03 pm, Wed, 3 March 21
Gujarati women Forced collections : మూడ్రోజుల క్రితం హైదరాబాద్‌లో రోడ్లపై రుబాబ్ చేసిన యువతులను చూసాం. తాజాగా.. అలాంటి సంఘటనే తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చోటు చేసుకుంది. దారినపోయే వాళ్లను రుబాబ్ చేస్తూ గుజరాతీ మహిళలు వసూళ్లకు పాల్పడుతున్నారు. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు స్పందించారు. వెంటనే సంఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు.
నిన్న.. హైదరాబాద్ శివారు ఘట్‌కేసర్‌లో స్వచ్చంద సంస్థ పేరుతో అమ్మాయిలు చందాలు వసూలు చేయడం కలకలం సృష్టించింది. ఇలా చందాలు వసూలు చేస్తున్న రాజస్థాన్, గుజరాత్‌కు చెందిన ఆరుగురు యువతులను ఘట్‌కేసర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈజీమనీకి అలవాటు పడిన ఆరుగురు అమ్మాయిలు బృందాలుగా ఏర్పడి వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
స్వచ్చంద సంస్థ పేరు చెప్పమని వాహనదారులు అడిగితే… సమాధానమివ్వకుండా.. డబ్బులు ఇవ్వని వాళ్లను యువతులు బెదిరిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై నిర్మానుష్య ప్రాంతాల్లో వాహనాలు ఆపి స్వచ్చంద సంస్థ పేరుతో చందాలు వసూలు చేస్తున్న యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Drunken Drive Cases : తాగినోళ్లను సేఫ్ గా ఇంటికి తీసుకెళ్లండి బార్ యజమానులకు సీపీ సూచన
Indian Skimmer : ఆంధ్రాలో అరుదైన అతిథులు… కాకినాడ తీరంలో స్కిమ్మర్ కనువిందు.. ఆసియా ఖండంలోని 230 జాతుల పక్షలు ఇక్కడే
సైన్యాన్ని అవమానిస్తూ రచయిత్రి ఫేస్బుక్ పోస్ట్.. అరెస్ట్ చేసిన పోలీసులు
జాగ్రత్త.. ఒకటికి రెండుసార్లు చెక్ చేసి కొనండి.. డేట్ మార్చి హల్దీరామ్ ఫుడ్స్ అమ్మకాలు..
Bharat Bandh : ఏప్రిల్ 26న భారత్ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు
Lockdown : తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్.. నెల్లూరు వ్యక్తి అరెస్ట్