Janasena pawan kalyan : మంత్రి కారుమూరీ..టీడీఆర్ బాండ్ల అవినీతి గురించి మాట్లాడే దమ్ములేని నీకెందుకు జనసేన పార్టీ గురించి..

టీడీఆర్ బాండ్ల అవినీతి గురించి మాట్లాడే దమ్ములేని నీకు జనసేన గురించి, పవన్ కళ్యాణ్ గురించి నీకెందుకు? అంటూ మంత్రి కారుమూరికి గుంటూరు జిల్లాా జనసేన అధ్యక్షుడు గాదె కౌంటర్ ఇచ్చారు.

Janasena pawan kalyan : మంత్రి కారుమూరీ..టీడీఆర్ బాండ్ల అవినీతి గురించి మాట్లాడే దమ్ములేని నీకెందుకు జనసేన పార్టీ గురించి..

Janasena pawan kalyan : అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసే దమ్ము జనసేనకు ఉందా? అటువంటి అవగాహన పవన్ కు ఉందా? అంటూ మచిలీపట్నంలో జనసేనపార్టీ 10వ ఆవిర్భావ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. కారుమూరికి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. మచిలీపట్నం లో జరిగిన జనసేన పదవ ఆవిర్భావ సభలో మేము ప్రజలకు ఏం చేస్తామో అది సుస్పష్టంగా చెప్పాం..మీలాగా అబద్దాలు చెప్పి అధికారంలోకి రాలేదంటూ కౌంటర్ ఇచ్చారు. ఏం చేస్తామని చెప్పామో అదే చేస్తాం.. ప్రజలకు మద్యం పోసి..డబ్బులిచ్చి ఓట్లు వేయించుకునే సంస్కృతి జనసేనకు లేదన్నారు. ప్రజల్ని ఎటువంటి ప్రలోభాలకు ఆశ పెట్టకుండా నిజాయితీగా ఓట్లు వేయమని కోరాం…అధికార పార్టీ ఎక్కడ ఏవిధమైన సభలు పెట్టినా..డబ్బులిచ్చి..భయపెట్టి జనాలను సమీకరిస్తారు..కానీ జనసేనకు అటువంటి దుస్థితి లేదు. జనాలకు ఎటువంటి ప్రలోభాలకు పెట్టలేదు..కానీ స్వంత ఖర్చులతో లక్ష లాది మంది సభకు వచ్చారు..అది జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్..పవన్ పై అభిమానంతోనే స్వంత ఖర్చులతో ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇసుక వేస్తే రాలనంత జనాలు వచ్చారని..కానీ ఇటువంటిది మీకు చేతకాదని ఎధ్దేవాచేశారు.

మంత్రులు అసెంబ్లీని వదిలేసి పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయటమే పనిగా పెట్టుకున్నారు..పాలన చేతకానివారు ఇది తప్ప ఇంకే చేస్తార్లే అంటూ ఎద్దేవా చేశారు. ప్రెస్ మీట్లు పెట్టి పవన్ ను తిట్టటం తప్ప వైసీపీ నేతలకు మరోపని లేదన్నారు గాదె వెంకటేశ్వరరావు..కారుమూరి నాగేశ్వరరావు నీకెందుకు జనసేన పార్టీ గురించి.. మంత్రిగా ఉన్నావు..నీ పని ఏంటో నువ్వు చూసుకో పవన్ ఎక్కడ పోటీ చేస్తారో..ఎన్ని నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందో నీకెందుకు? నీ మంత్రి పని నువ్వు చూస్కో అంటూ కౌంటర్ ఇచ్చారు.

తణుకులో జరిగిన టీడీఆర్ బాండ్ల అవినీతి గురించి నీకు మాట్లాడే దమ్ముందా..? అంటూ ప్రశ్నించారు. అవినీతి గురించి మాట్లాడే దమ్ములేనివారు పవన్ కల్యాణ్ పై విమర్శలు చేయటానికి మాత్రం నోళ్లు లేస్తాయి అంటూ మండిపడ్డారు గాదె. దిశా చట్టానికి చట్టబద్ధత చేయలేని ప్రభుత్వం వైయస్సార్ ప్రభుత్వం..ప్రతిపక్షాలమీద ఇష్టానుసారంగా మాట్లాడటం మాత్రం బాగా చేస్తారని విమర్శించారు. జనసేన పార్టీకి ప్రజల్లో వచ్చిన స్పందన చూచి వైయస్సార్ నాయకులకు వణుకు మొదలైంది..
అందుకే ఏమీ చేయలేక అది జీర్ణించుకోలేక పవన్ పై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతుంటారని గాదె మండిపడ్డారు.

జనసేన ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఏర్పడిన పార్టీ..మీలాగా దోపిడీ పార్టీ కాదన్నారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి కనీసం అభివృద్ధి చేయటం కూడా చేతకాక విపక్షలపై విమర్శలు చేస్తూ కాలయాపన చేస్తున్నారంటూ మండిపడ్డారు గాదె. నాడు నేడు పేరుతో కోట్లు దండుకుంటున్నారుని విమర్శించారు. నాగార్జున యూనివర్సిటీలోకి గెస్ట్ గా ఒక పిచ్చోడు రాంగోపాల్ వర్మను తీసుకు వచ్చి పిచ్చి పిచ్చి ప్రేలాపన పేలిస్తున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు.ఆ పిచ్చోడు విద్యార్థులకు ఏం చెప్పాలో కూడా తెలియని స్థితిలో ఉన్నాడని ఇటువంటి ఉన్మాదికి సంస్కారం అంటే ఏంటో కూడా అర్థం తెలియదని..వర్మలాంటి వ్యక్తి నుంచి సంస్కారాన్ని ఆశించటం కూడా దండగేనన్నారు.