Kavati Manohar : బీజేపీని నిర్వీర్యం చేశారు, నెక్ట్స్ టీడీపీనే- కన్నాపై మేయర్ మనోహర్ ఫైర్

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే చంద్రబాబుకి తొత్తులా మారావు అని విమర్శించారు. బీజేపీ తన చరిత్రలో ఇంత అర్దాంతరంగా అధ్యక్ష పదవి నుంచి తొలగించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కన్నానే అని ఆయన అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఏపీలో బీజేపీని నిర్వీర్యం చేశారన్న మనోహర్.. ఇప్పుడు టీడీపీని కూడా నిర్వీర్యం చేయనున్నారని విమర్శించారు.

Kavati Manohar : బీజేపీని నిర్వీర్యం చేశారు, నెక్ట్స్ టీడీపీనే- కన్నాపై మేయర్ మనోహర్ ఫైర్

Kavati Manohar : బీజేపీకి రిజైన్ చేసి టీడీపీలో చేరబోతున్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై మేయర్ కావటి మనోహర్ ఫైర్ అయ్యారు. కన్నాను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ ను తిడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. బీజేపీలో ఫెయిల్ అయ్యి జగన్ పై అవాకు చెవాకులు పేలుతున్నారని కన్నాపై మండిపడ్డారు. 2014లో వైసీపీలో చేరాలని కన్నా అనుకున్నారని కావటి మనోహర్ చెప్పారు. రాత్రికి రాత్రి గుండె నొప్పి వచ్చిందని ఆసుపత్రిలో చేరిన సంగతి మర్చిపోయారా అంటూ కన్నాను నిలదీశారు.

Also Read..Harirama Jogaiah Survey: ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయో చెప్పిన హరిరామ జోగయ్య

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే చంద్రబాబుకి తొత్తులా మారావు అని విమర్శించారు. బీజేపీ తన చరిత్రలో ఇంత అర్దాంతరంగా అధ్యక్ష పదవి నుంచి తొలగించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కన్నానే అని ఆయన అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఏపీలో బీజేపీని నిర్వీర్యం చేశారన్న మనోహర్.. ఇప్పుడు టీడీపీని కూడా నిర్వీర్యం చేయనున్నారని విమర్శించారు.(Kavati Manohar)

వంగవీటి చనిపోయంది చంద్రబాబు వల్ల కాదా? చంద్రబాబు అవినీతి చేశారని కేసులు వేసింది కన్నా కాదా? అని ఆయన ప్రశ్నించారు. టీడీపీలో న్నా చేరడం అంటే.. దెయ్యాలు వేదాలు వల్లించిట్లు ఉందన్నారు. సీఎం జగన్ ని మాట అంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. సోనియా గాంధీని ఎదిరించి వైసీపీ పెట్టి గెలిపించిన మగాడు జగన్ అని కావటి మనోహర్ అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలోకి వెళితే ఆ పార్టీ కూడా బీజేపీ లానే రాష్ట్రంలో అడ్రస్ లేకుండా పోతుందన్నారు.

Also Read..Kanna Lakshmi Narayana: మోదీ పట్ల జీవితాంతం అభిమానంతో ఉంటా.. రాష్ట్ర పార్టీలో పరిస్థితులకు ఇమడలేకే రాజీనామా..

”రాయపాటితో రాజీపడింది నిజం కాదా? ఎన్ని కోట్లు తీసుకుని రాజీ పడ్డావ్? 2019తో బీజేపీ ఎంపీగా పోటీ చేస్తే 15వేల ఓట్లు వచ్చాయి. ఇదీ కన్నా చరిత్ర. జనాలు సిగ్గుతో చచ్చిపోతున్నారు. చంద్రబాబు తాయిలాల కోసం వైసీపీపై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఉపేక్షించేది లేదు. ముద్రగడ పద్మనాభంపై దాడులు చేసింది ఎవరు?” అని కావటి మనోహర్ విరుచుకుపడ్డారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇటీవలే బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. రాష్ట్ర పార్టీలో పరిస్థితులకు ఇమడలేక బీజేపీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందన్నారు. ఇక తెలుగుదేశం పార్టీలో చేరాలని కన్నా నిర్ణయించుకున్నారు. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు.