Purandeswari: కార్యకర్తలే బీజేపీ బలం.. ఏపీ అభివృద్ధిలో కేంద్రం కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ఏపిలో బీజేపీకి బలం లేదన్న వారికి త్రిపుర రాష్ట్ర పార్టీ నిర్మాణం ఒక జవాబు కావాలని, ఏపీలోనూ అలా కార్యకర్తల ద్వారా పార్టీ నిర్మాణం జరుగుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. బుధవారం విశాఖలో...

Purandeswari: కార్యకర్తలే బీజేపీ బలం.. ఏపీ అభివృద్ధిలో కేంద్రం కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Purandeswari

Purandeswari: ఏపిలో బీజేపీకి బలం లేదన్న వారికి త్రిపుర రాష్ట్ర పార్టీ నిర్మాణం ఒక జవాబు కావాలని, ఏపీలోనూ అలా కార్యకర్తల ద్వారా పార్టీ నిర్మాణం జరుగుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. బుధవారం విశాఖలో బీజేపీ ఉత్తరాంధ్ర జోనల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పురంధరేశ్వరితో పాటు బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు, బిజెపి జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్, రాష్ట్ర పార్టీ సహ ఇన్ చార్జి, జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ. పార్టీ బలోపేతానికి, నాయకత్వ నిర్మాణానికి దోహదపడే సమావేశం తొలిసారి ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేశామన్నారు. ఏపిలో బిజెపికి బలం లేదన్న వారికి త్రిపుర రాష్ట్ర పార్టీ నిర్మాణం ఒక జవాబు కావాలని, ఏపీలోనూ అలా కార్యకర్తల ద్వారా పార్టీ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. యూపిలో 35 ఏళ్లలో ఒక పార్టీ రెండోసారి అధికారానికి రాలేదని, కనుక బిజెపి రాదని అన్నారని, కానీ బిజెపి సాధించి చూపిందంటే కార్యకర్తల దీక్షా దక్షతలే కారణమన్నారు.

AP BJP: ఏపీలో పట్టుసాధించేందుకు బీజేపీ కసరత్తు.. క్షేత్రస్థాయిలో బలోపేతంపై దృష్టి

“సబ్ కా సాథ్ సబ్ కా వికాస్” నినాదంతో అధికారానికి వచ్చిన బిజెపి అది సాధించి చూపినందువల్లనే ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. దృఢమైన నాయక్వం బిజెపి సొంతమని పురంధరేశ్వరి తెలిపారు. 2019లో సబ్ కా విశ్వాస్ తో మరిన్ని ఎక్కువ సీట్లు కట్టబెట్టారని అన్నారు. 2020 లో కరోనా సవాలును సమర్ధంగా ఎదుర్కొన్నామని, కేంద్ర ప్రభుత్వ నాయకత్వ ప్రతిభ మరోసారి లోకానికి తెలిసిందన్నారు. కరోనాను ఎదుర్కొనటానికి స్వదేశీ సాంకేతికతతో సర్వం తయారు చేసుకున్నామని, 170 కోట్ల డోసుల వాక్సిన్స్ ఇచ్చి కోవిడ్ ని అదుపు చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదేనని అన్నారు. ఏపీలో బీజేపీని ఆదరించారా లేదా అనేది కాకుండా కొత్త రాష్ట్రం అభివృద్ధికి వేలకోట్లు కేటాయించారని, రాజధాని అమరావతి, జాతీయ రహదారులు, పోలవరం జాతీయ ప్రాజెక్టు, విభజన హామీల అమలు చిత్తశుద్ధితో జరపడం జరిగిందని తెలిపారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, అధికారమనేది చెలాయించటానికి కాదని, ప్రజా సేవకి అని నమ్మేది బిజెపి అన్నారు.

AP BJP : విశాఖ రైల్వేజోన్‌‌కు త్వరలోనే ఆమోద ముద్ర, మా పయనం జనసేనతోనే

నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి సాధిస్తోందని, సాగర్ మాలకింద జాతీయ రహదారుల అభివృద్ధికి శ్రీకాకుళం జిల్లాలోనే సుమారు మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించారని అన్నారు. వెనుకబడిన జిల్లాల్లో కేంద్ర నిధులు ఎన్నో నిధులు ఇస్తున్నారని, పార్వతీపురం, మన్యం జిల్లా సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం‌ ఏర్పాటవుతోందని, ట్రైబల్ మ్యూజియం ఒకటి లంబసింగిలో ఏర్పడుతోందని, విజయనగరంలొ 2,60,000 మంది రైతులకు కిసాన్ సమ్మాన్ నిధులు అందుతున్నాయని పురంధరేశ్వరి తెలిపారు. అనకాపల్లి జిల్లాలో ఐఐపిఇ కి సబ్బవరంలో భూమి కేటాయిస్తానన్న రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకూ సేకరించలేదని అన్నారు. విశాఖలో 2077 కోట్లు స్మార్ట్ సిటీ పథకం కింద కేంద్రం కేటాయించటం జరిగిందని అన్నారు. ఈ అంశాలన్నీ ప్రజల్లోకి తీసుకుపోవాలని, మోదీ నాయకత్వాన్ని, తద్వారా దేశపురోగతిని ఆశించే బిజెపిని బలోపేతం చేయాలని, అందుకు కార్యకర్తలే కీలకం అని పురంధరేశ్వరి అన్నారు.

Somuveerraju : 2024లో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : సోమువీర్రాజు

బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆరుకోట్ల ప్రజల్లో ఎందరితో మనకు పొత్తుందని, కోటిమందికి రెండు సార్లు బియ్యం, 90లక్షల మందికి ఉపాధిహామీ, 70లక్షల మంది రైతులకు ఆరువేలు చొప్పున కిసాన్ సమ్మాన్ నిధులు ఇస్తున్నామని, వీరందరితో మనకు పొత్తు ఉన్నట్లే నని సోము పేర్కొన్నారు. వీరిని కలిసి పార్టీని బలోపేతం చేసుకోవడానికి, కార్యకర్తలను సంసిద్ధం చేయటానికే ఈ జోనల్ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నామని సోము వీర్రాజు అన్నారు. ఏపీలో బీజేపీ, జనసేనలకు తప్ప ఏ పార్టీకి ఓటు బ్యాంకు లేదని తెలిపారు.