ఆరోగ్య శ్రీ పథకాన్ని నిర్లక్ష్యం చేశారా..కఠిన చర్యలు తప్పవు – సీఎం జగన్ వార్నింగ్

  • Published By: madhu ,Published On : September 5, 2020 / 08:11 AM IST
ఆరోగ్య శ్రీ పథకాన్ని నిర్లక్ష్యం చేశారా..కఠిన చర్యలు తప్పవు – సీఎం జగన్ వార్నింగ్

ప్రైవేట్ ఆస్పత్రుల తీరుపై ఏపీ సీఎం జగన్ ఫైర్‌ అయ్యారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని నీరుగార్చేలా వ్యహరిస్తే కఠినచర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలతో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడ తప్పు జరిగినా.. రోగులకు వైద్యం అందకున్నా వెంటనే ప్రైవేట్‌ ఆస్పత్రులపై అధికారులు చర్యలు తీసుకోవాలని జగన్‌ ఆదేశించారు.




కరోనా ఆస్పత్రులను మానిటరింగ్ చేస్తున్నట్టుగానే ఆరోగ్య శ్రీ ఆస్పత్రులపై సమీక్ష నిర్వహించాలన్నారు ఏపీ సీఎం జగన్. ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చేలా వ్యవరించే ఆస్పత్రులపై యాక్షన్ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. సేవలు అందరికీ అందుబాటులో ఉండాలంటే ప్రతి ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు.




రిఫరల్‌ విధానం చాలా సమర్థవంతంగా ఉండాలన్నారు. రోగులనుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకొని.. ఆస్పత్రులకు రేటింగ్‌ ఇవ్వాలన్నారు సీఎం జగన్. ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. కరోనా రోగులకు మెడిసిన్స్‌ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ కరోనా ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలన్నారు.




కోవిడ్‌ సెంటర్లపై నిరంతరం నిఘాపెట్టాలన్నారు. అటు కొత్త వైద్య కాలేజీల నిర్మాణం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని అధికారులకు సూచించారు సీఎం జగన్. మరోవైపు ప్రభుత్వ నియమాలను పాటించని కోవిడ్‌ సెంటర్లకు ఆరోగ్యశాఖ షాక్‌ ఇచ్చింది. విజయవాడలోని అన్ని కోవిడ్ సెంటర్ల లైసెన్స్ రద్దు చేసింది.