Krishna River : కృష్ణమ్మ పరవళ్లు, శ్రీశైలం డ్యాం కొత్త అందాలు..నాగార్జున సాగర్ గేట్లు ఎత్తేస్తారా ?

ఎగువన కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా పరివాహాక ప్రాంతమంతా జలకళతో కళకళలాడుతుంది. బిరా బిరా కృష్ణమ్మ పరుగులు పెడుతు పరమశివుడికి అభిషేకిస్తోంది. శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడంతో.. కొత్త అందాలతో కనువిందు చేస్తున్నాయి. ఆ నీటి సోయగం కనువిందు పర్యాటకులను చేస్తోంది.

10TV Telugu News

Heavy Discharge Of Flood : ఎగువన కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా పరివాహాక ప్రాంతమంతా జలకళతో కళకళలాడుతుంది. బిరా బిరా కృష్ణమ్మ పరుగులు పెడుతు పరమశివుడికి అభిషేకిస్తోంది. శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడంతో.. కొత్త అందాలతో కనువిందు చేస్తున్నాయి. ఆ నీటి సోయగం కనువిందు పర్యాటకులను చేస్తోంది.

నాగార్జున సాగర్ : –
నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతోంది. ఇదే ఇన్‌ఫ్లో కొనసాగితే.. నాగార్జునసాగర్‌ గేట్లు కూడా మరో మూడు నాలుగు రోజుల్లో తెరుచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌కు ఇన్‌ఫ్లో 5లక్షల 34 వేల 189 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 35వేల 820 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పూర్తిస్తాయి నీటి మట్టం 590 అడుగులు కాగా. ప్రస్తుతం 568.5 అడుగులకు చేరుకుంది నీటిమట్టం. సాగర్ పూర్తిస్థాయి సామర్త్యం 312 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 252 టీఎంసీలకు చేరుకుంది. ఈ నీటి నిల్వలతోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు.. అధికారులు.

తుంగభద్ర: –
తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు ఉండగా, ప్రస్తుత నీటి మట్టం 1632.55 అడుగులుగా కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ 100 టీఏంసీలు ఉండగా, ప్రస్తుత నీటినిల్వ 99 టీఎంసీలుగా ఉంది. తుంగభద్ర ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 52,140 క్యూసెక్కులు వస్తుండగా, అవుట్ ఫ్లో 29వేల 500 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.

జూరాల ప్రాజెక్టు : –
ఎగువన వస్తోన్న వరదనీటితో జూరాల ప్రాజెక్టుకు నీటి ప్రవాహాం కొనసాగుతోంది. దీంతో జూరాల ప్రాజెక్ట్‌ 47 గేట్లు.. ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు ప్రాజెక్టు అధికారులు. జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 4లక్షల 77 వేల క్యూసెక్కులుగా, ఔట్ ఫ్లో 4 లక్షల 73వేల క్యూసెక్కులు కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో.. జలసవ్వడి పర్యాటకులను ఆకర్షిస్తోంది.

10TV Telugu News