Polavaram Project Flood : పోలవరం ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు.. అటు వైపు వెళ్లకుండా చెక్ పోస్ట్ ఏర్పాటు

పోలవరం ప్రాజెక్ట్ వద్ద మళ్లీ వరద ఉధృతి కొనసాగుతోంది. గత నెల వరద ఉధృతితో కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయిన తర్వాత మళ్లీ ఆ స్థాయిలో వరద వస్తోంది. వరద ప్రవాహం గంట గంటకు భారీగా పెరుగుతోంది.

Polavaram Project Flood : పోలవరం ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు.. అటు వైపు వెళ్లకుండా చెక్ పోస్ట్ ఏర్పాటు

Polavaram Project Flood: పోలవరం ప్రాజెక్ట్ వద్ద మళ్లీ వరద ఉధృతి కొనసాగుతోంది. గత నెల వరద ఉధృతితో కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయిన తర్వాత మళ్లీ ఆ స్థాయిలో వరద వస్తోంది. వరద ప్రవాహం గంట గంటకు భారీగా పెరుగుతోంది.

అప్ స్ట్రీమ్ స్పిల్ వే 34.25 కాగా.. డౌన్ స్ట్రీమ్ స్పిల్ వే 25.60గా ఉంది. ప్రాజెక్టులోకి 12లక్షల 20వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. దాదాపు అదే స్థాయిలో ఔట్ ఫ్లో ఉంది.

Godavari Floods: పోల‌వ‌రం వ‌ద్ద ప్ర‌మాద‌క‌ర స్థాయిలో గోదావ‌రి ప్ర‌వాహం.. ధవళేశ్వరం వద్ద..

ఇక కడెం కెనాల్ లోకి గోదావరి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. పోలవరం ప్రాజెక్టుకు వెళ్లేందుకు వీలు లేకుండా కడెం కెనాల్ వంతెన నీట మునిగింది. పోలవరం ప్రాజెక్ట్ వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. కడెం కాలువపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. నీటి ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Godavari Flood: వరద గోదావరి.. వందేళ్లలో తొలిసారిగా..

భద్రాచలం వద్ద దడపుట్టిస్తున్న గోదావరి..
మరోవైపు భద్రాచలం దగ్గర గోదావరి నదికి స్థిరంగా వరద కొనసాగుతోంది. నిన్న ఉదయం నుంచి ఒక్క అడుగు మేర నీటిమట్టం పెరిగింది. 51 అడుగుల నుంచి 52 అడుగులకి చేరింది. 13లక్షల 49వేల 465 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. ఇవాళ మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. భద్రాచలం చర్ల వెంకటాపురం రూట్లలో ఆర్టీసీ బస్సుల రాకపోకలను నిలిపివేశారు. అలాగే ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వెళ్లే రహదారులను మూసివేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw