Srisailam Project : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

ప్రస్తుతం నీటి మట్టం 836.40 అడుగులగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు. ప్రస్తుతం 56.78 టీఎంసీలు నిల్వ ఉంది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం నుంచి 31,784 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Srisailam project : ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చిచేరుతోంది. జూరాల నుంచి 1,45,940 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 1,15,792 క్యూసెక్కులు మొత్తంగా శ్రీశైలం ప్రాజెక్టుకు 2,61,732 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు గరిష్ట నీటి‌మట్టం 885 అడుగులు. ప్రస్తుతం నీటి మట్టం 836.40 అడుగులగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు. ప్రస్తుతం 56.78 టీఎంసీలు నిల్వ ఉంది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం నుంచి 31,784 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరదతో ప్రస్తుతం గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రమాదస్థాయిలో వరద నీరు ప్రవహిస్తోంది. ఏపీలోని లంక గ్రామాలు పూర్తిగా జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. భారీ వానలు ముంచెత్తుతున్నాయి. భారీ వరదల కారణంగా ఊరూవాడా ఏకమయ్యాయి. ముఖ్యంగా లంక గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మరికొన్ని గ్రామాలను ముంపు ముప్పు వెంటాడుతోంది.
CM Jagan : గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పోలవరం వద్ద 16లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతుంది. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. అనేక గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. మరోవైపు కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలను ఖాళీ చేయించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మూడవ ప్రమాద హెచ్చరిక జారీ అయితే 31,382 కుటుంబాలపై ప్రభావం పడుతుంది. ప్రజలు ఒప్పుకోక పోతే బలవంతంగా ఖాళీ చేయించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఏ క్షణమైనా మూడో ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు