Rain Alert : ఏపీకి వర్ష సూచన.. ఆ తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయంది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడగా, ఈ నెల 9న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత

Rain Alert : ఏపీకి వర్ష సూచన.. ఆ తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Rain Alert

Rain Alert : ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయంది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడగా, ఈ నెల 9న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తం కొనసాగుతోందని, ఈ నెల 9 నాటికి అది అల్పపీడనంగా మారనుందని వివరించింది. క్రమేపీ అది బలపడి వాయవ్య దిశగా పయనిస్తుందని, దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడులోనూ, దక్షిణ కోస్తాంధ్రలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

Obesity medicine : ఊబకాయం తగ్గించే ఇంజెక్షన్..ఎగబడుతున్న జనాలు..

ఈ నెల 11, 12 తేదీల్లో దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారడంతో కోస్తా తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు.

Ladyfinger : రక్త సరఫరా మెరుగు పరిచి…శ్వాసకోశ సమస్యల్ని దూరం చేసే బెండకాయ

ఈ నెల 9, 10వ తేదీల్లో తమిళనాడులోనూ… 10, 11, 12 తేదీల్లో దక్షిణ కోస్తాంధ్రలోనూ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ నెల 9 లోపు తీరప్రాంతాలకు చేరుకోవాలని స్పష్టం చేసింది.