ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన

తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రానున్న 48

  • Published By: naveen ,Published On : June 11, 2020 / 10:49 AM IST
ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన

తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రానున్న 48

తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రానున్న 48 గంటల్లో వాయువ్యంగా పయనిస్తూ మరింత బలపడునుందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనానికి తోడు నైరుతి ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. నేడు ఉత్తర కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడతాయని వెల్లడించింది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పింది. రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయంది. రేపు కూడా వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మత్య్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఇటు తెలంగాణలోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది.

తెలంగాణలో వచ్చే 2 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వానలు:
తూర్పు మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండు రోజులపాటు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రధానంగా ములుగు, వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ అర్బన్‌, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, సూర్యాపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, జనగామ జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు, శుక్రవారం(జూన్ 12,2020) అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అల్పపీడన ప్రభావంతో వాతావరణం వర్షాలకు అత్యంత అనుకూలంగా మారిందన్నారు. నైరుతి రుతుపవనాలు నిలకడగా విస్తరిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం తమిళనాడులో చాలాప్రాంతాలు, కర్ణాటక, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి విస్తరించినట్టు వెల్లడించారు.   

తెలంగాణలో కుంభవృష్టి:
అల్పపీడన ప్రభావంతో బుధవారం(జూన్ 10,2020) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. ఈదురుగాలుల దాటికి  పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. నిర్మల్‌ జిల్లా దస్తురాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌, నార్నూర్‌, భీంపూర్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షం కురిసింది. మందమర్రి సోమగూడెం రోడ్డులో చొప్పరిపల్లి సమీపంలో భారీ వృక్షం నేలకొరిగింది. ఉమ్మడి నిజామాబాద్‌, సిద్దిపేట జిల్లాల్లోని పలు మండలాల్లో భారీ వాన పడింది. మెదక్‌, సంగారెడ్డి పట్టణంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

అటు గ్రేటర్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల మరో మూడు రోజులు గ్రేటర్‌లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. గ్రేటర్‌ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో అత్యధికంగా 7.8 సెంటీమీటర్లు, అత్యల్పంగా మైలార్‌దేవ్‌పల్లిలో 1.0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

* తెలంగాణలో కుంభవృష్టి
* ములుగు, యాదాద్రి, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు
* యాదాద్రి భునవగిరి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు
* అత్యధికంగా భువనగిరిలో 17.04 సెం.మీ వర్షపాతం నమోదు
* మర్యాల 14, యాదగిరిగుట్ట 10, వెంకిర్యాలలో 11 సెం.మీ వర్షపాతం
* ములుగు జిల్లా మంగపేటలో 14, తాడ్వాయిలో 10 సెం.మీ వర్షపాతం
* ఆదిలాబాద్ జిల్లా పోచరలో 12 సెం.మీ వర్షపాతం 
* ఖమ్మం జిల్లా మధిరలో 9.06, ఎర్రపాలెంలో 9.03 సెం.మీ వర్షపాతం
* రంగారెడ్డి జిల్లా కల్వంచలో 8.02 సెం.మీ వర్షపాతం
* మెదక్ జిల్లా పోడ్చన్ పల్లిలో 6 సెం.మీ వర్షపాతం నమోదు

Read: పేదలకు, మహిళలకు ‘జగనన్న తోడు’ : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే