Nellore Rain : వానలకు వణుకుతున్న నెల్లూరు.. మునిగిన గూడూరు ఆర్టీసీ బస్టాండ్!

గూడూరు ఆర్టీసీ బస్టాండ్‌లోకి వరద నీరు చేరింది. గూడూరులో జోరు వానలకు RTC బస్టాండ్ మునిగిపోయింది. డిపోలోకి భారీగా వరదనీరు చేరడంతో బస్సులను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు

Nellore Rain : వానలకు వణుకుతున్న నెల్లూరు.. మునిగిన గూడూరు ఆర్టీసీ బస్టాండ్!

Nellore

Nellore Dist : మొన్నటి వరదలకే అల్లాడిపోయిన నెల్లూరు ప్రజలను.. వరుణుడు మరోసారి వణికిస్తున్నాడు. జిల్లాలో మరో రెయిన్ ఎపిసోడ్ స్టార్ట్ అయింది. నెల్లూరు వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జిల్లాలో సరాసరి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బుచ్చిలో 14 పాయింట్‌ 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు గ్రామాలను ముంచెత్తుతున్నాయి. పలుచోట్ల రాకపోకలు బంద్‌ అయ్యాయి. వరద నీరు ముంచెత్తడంతో.. పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. చెరువులు నిండు కుండల్లా మారాయి.

Read More : Penna River : నెల్లూరులో ఉధృతంగా ప్రవహిస్తున్న పెన్నానది..సమీపంలోని ఇళ్లు కూలిపోయే ప్రమాదం

గూడూరులో పంబలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గూడూరు వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో.. విజయవాడ – చెన్నై మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. అటు.. గూడూరు వెంకటగిరికి మధ్య కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గూడూరు ఆర్టీసీ బస్టాండ్‌లోకి వరద నీరు చేరింది. గూడూరులో జోరు వానలకు RTC బస్టాండ్ మునిగిపోయింది. డిపోలోకి భారీగా వరదనీరు చేరడంతో బస్సులను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ఇప్పటికే వర్షాల్లో నానుతున్న జిల్లా ప్రజలు.. మరోసారి వర్షం బీభత్సం సృష్టిస్తుండటంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read More : Marijuana smuggling : విశాఖ నుంచి తరలిస్తున్న 10క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్న సంగారెడ్డి పోలీసులు

మరోవైపు…
నెల్లూరు జిల్లాను వర్షాలు మళ్లీ వణికిస్తున్నాయి. 2021, నవంబర్ 28వ తేదీ ఆదివారం నుంచి కురుస్తున్న వర్షాలతో.. పెన్నానదిలో వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం నెల్లూరు వద్ద పెన్నా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని తీరం కోతకు గురవుతోంది. భగత్‌సింగ్ కాలానీలో.. ప్రమాదం పొంచి ఉంది. నది సమీపంలోని ఇళ్లు కోతకు గురవుతుండడంతో.. కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు.