Heavy Rains: నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కుండపోతగా వర్షం..

అకాల వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మళ్లీ వానలు విపరీతంగా కురుస్తున్నాయి.

Heavy Rains: నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కుండపోతగా వర్షం..

Rains

Heavy Rains: అకాల వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మళ్లీ వానలు విపరీతంగా కురుస్తున్నాయి. మొన్నటి వరకు కురిసిన వర్షాలకు ఈ రెండు జిల్లాలతో పాటు.. కడప జిల్లా తీవ్రంగా ప్రభావితం అవ్వగా మరోసారి వర్షాలు కుంపోతగా కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నెల్లూరు, చిత్తూరు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపోర్లుతుండగా.. చెరువులకు గండ్లు పడి గ్రామాలు మునిగిపోతున్నాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఆత్మకూరు, వెంకటగిరి ఉదయగిరి, కావలి, కలిగిరి ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఆత్మకూరు, అనంతసాగరం, మర్రిపాడు, కేజర్ల, సంఘం మండలాల్లో దంచికొడుతోంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నాయుడుపేట, గూడురుల్లో కూడా వర్షం ప్రభావం తీవ్రంగా ఉంది.

అదేవిధంగా చిత్తూరు జిల్లాలోనూ.. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పల్లపు ప్రాంతాల్లో ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని కోరుతున్నారు వాతావరణ నిపుణులు. ప్రకాశం జిల్లాలోని చిరాలలో కూడా వర్షం జోరుగా కురుస్తుంది.