Schools Holiday : భారీ వర్షాల ఎఫెక్ట్.. స్కూళ్లకు సెలవు

భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు, కడప జిల్లా విద్యాశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. స్కూళ్లకు రేపు (నవంబర్ 29,2021) సెలవు ప్రకటించారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు పడుతుండగా, రాబోయే..

Schools Holiday : భారీ వర్షాల ఎఫెక్ట్.. స్కూళ్లకు సెలవు

Schools Holiday

Schools Holiday : భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు, కడప జిల్లా విద్యాశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. స్కూళ్లకు రేపు (నవంబర్ 29,2021) సెలవు ప్రకటించారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు పడుతుండగా, రాబోయే రెండు రోజుల్లో అవి తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Fridge : ఫ్రిజ్‌లో… ఆ.. ఆహార పదార్థాలను ఉంచకపోవటమే మేలు.. ఎందుకంటే?

భారీ వర్షాలు ఏపీని వణికిస్తున్నాయి. పలు జిల్లాలు తడిసి ముద్ధవుతున్నాయి. నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో నిన్నటి నుంచి వాన పడుతోంది. నవంబర్ 29న అండమాన్‌ తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 48 గంటల తర్వాత అది మరింత బలపడనుందని హెచ్చరించింది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో(ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు) రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో 7 సెంటిమీటర్ల నుంచి 20 సెంటిమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Stop Charging Phones : ఆఫీసులో మొబైల్ ఛార్జింగ్ పెడితే..జీతం కట్!

అలాగే గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురవచ్చని తెలిపింది. ఇక తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, డిసెంబర్ 1 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో చిత్తూరు, కడప జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ రెండు జిల్లాల్లో విద్యాలయాలకు సెలవు ప్రకటించారు.