నెల్లూరును ముంచెత్తిన భారీ వర్షం, నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

10TV Telugu News

heavy rains in nellore: నెల్లూరును భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. లెక్చరర్స్ కాలనీ, ఆర్టీసీ కాలనీ, కొండాయపాలెంలో వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. నెల్లూరు, సూళ్లూరుపేట, కావలి, బుచ్చిరెడ్డిపాళెం ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. మాగుంట లే అవుట్ అండర్ బ్రిడ్జి దగ్గర భారీగా వర్షపు నీరు చేరింది. వరద ప్రవాహం సంగతి తెలియక అటుగా వెళ్తున్న రెండు ఆర్టీసీ బస్సులు నీటిలో చిక్కుకుపోయాయి.