Visakhapatnam : విశాఖ రైల్వే స్టేషన్ వద్ద హైఅలర్ట్..మధ్యాహ్నం 12 గంటల వరకు మూసివేత
విశాఖ రైల్వే స్టేషన్ వద్ద హైఅలర్ట్ కొనసాగుతోంది. అగ్నిపథ్ ఫథకానికి నిరసనగా దాడులు జరిగే ఆవకాశం ఉండటంతో పోలీసులు భారీ మోహరించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు విశాఖ రైల్వే స్టేషన్ మూసివేశారు.

Visakha Railway
Visakhapatnam railway : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై దాడితో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఏపీలోనూ ఇలాంటి దాడులు జరిగే అవకాశముందని ఇప్పటికే నిఘా వర్గాలు హెచ్చరించాయి. విశాఖ, గుంటూరు రైల్వే స్టేషన్లపై సంఘ విద్రోహ శక్తులు దాడి చేసే అవకాశముందని నిఘా వర్గాలు అలర్ట్ చేశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ ఆస్తులకు ప్రత్యేక భద్రత కల్పించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్య రైల్వే స్టేషన్లలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రధాన రైల్వే స్టేషన్లకు భద్రత పెంచారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల దగ్గర ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆర్మీ అధికారులు, డిఫెన్స్ అకాడమీ వారితో సంప్రదించినట్టు పోలీసులు తెలిపారు. రైల్వే పరిధిలోని ఆర్పీఎఫ్, జీఆర్పీ నుంచి అదనపు బలగాలను రప్పించారు.
విశాఖ రైల్వే స్టేషన్ వద్ద హైఅలర్ట్ కొనసాగుతోంది. అగ్నిపథ్ ఫథకానికి నిరసనగా దాడులు జరిగే ఆవకాశం ఉండటంతో పోలీసులు భారీ మోహరించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు విశాఖ రైల్వే స్టేషన్ మూసివేశారు. రైల్వే స్టేషన్ కు వెళ్లే అన్ని రహదారులను పోలీసులు మూసివేశారు. జిఆర్పీ, ఆర్పీఎఫ్, సివిల్ పోలీసులు వలయంలో విశాఖ రైల్వే స్టేషన్ ఉంది.
రైల్వేస్టేషన్‌లోకి ఎవరిని పోలీసులు అనుమతించడం లేదు. డిఫైన్స్ అకాడమి సెంటర్స్ వద్ద నిఘా విద్యార్థుల కదలికలపై ఆరా తీశారు. విజయవాడ నుంచి వచ్చే రైళ్లన్నీ దువ్వాడ వద్ద, హౌరా నుంచి వచ్చే రైళ్లన్నీ కొత్తవలస వద్ద నిలిపివేసి, దారి మళ్లించనున్నట్లు అధికారులు ప్రకటించారు.