Home » Andhrapradesh » ఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్
Updated On - 3:34 pm, Wed, 7 April 21
ఏపీలో పరిషత్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎన్నికలను ఆపడం కష్టం అని హైకోర్టు అభిప్రాయపడింది. పరిషత్ ఎన్నికలు యథాతథంగా జరపాలని ఎలక్షన్ కమీషన్‌కు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.
ఈ నిర్ణయంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్ జరగనుంది. హైకోర్టు సింగిల్ బెంచ్ స్టేను కొట్టేసిన డివిజన్ బెంచ్ ఎన్నికలు జరుపుకోవచ్చునని స్పష్టంచేసింది.
హైకోర్టు తీర్పుతో రేపు అనగా.. ఏప్రిల్ 8వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌కు అనుమతించిన హైకోర్టు..ఫలితాలను మాత్రం ప్రకటించకూడదని ఆదేశాలు జారీచేసింది
తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఫలితాలు వెల్లడించవద్దని తీర్పు ఇచ్చింది డివిజన్ బెంచ్
Ugadi Panchangam 2021 : జగన్, కేసీఆర్ జాతకాలు ఎలా ఉండబోతున్నాయి? చంద్రబాబు భవిష్యత్తు ఏంటి?
AP Parishat elections : ఏపీలో రేపే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
ఏపీ పరిషత్ ఎన్నికలపై ఉత్కంఠ
Minister Kodali Nani: భయపడి పారిపోయి.. ఎన్నికలను అడ్డుకుంటున్నారు
Ramana Dikshitulu : రమణదీక్షితులు రీ ఎంట్రీ!
Ambati Rambabu: రాష్ట్రంలో ఇక టీడీపీ శకం ముగిసినట్లే