Kuppam : బాబు టూర్‌లో హై టెన్షన్ ..రాళ్లు విసిరిన గుర్తు తెలియని వ్యక్తులు

టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటన ఉద్రిక్తలకు దారి తీస్తోంది. కుప్పంలో నిర్వహిస్తున్న సభలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది.

Kuppam : బాబు టూర్‌లో హై టెన్షన్ ..రాళ్లు విసిరిన గుర్తు తెలియని వ్యక్తులు

Babu Kuppam

Chandrababu Kuppam : టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటన ఉద్రిక్తలకు దారి తీస్తోంది. కుప్పంలో నిర్వహిస్తున్న సభలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. బాంబులు అంటూ సభలో గుర్తు తెలియని రాళ్లు విసరడంతో తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కార్యకర్తలు చలో దిక్కుకు పరుగులు తీశారు. దీంతో బాబు సెక్యూర్టీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. రాళ్లు విసిరిన ఇద్దరు వ్యక్తులను టీడీపీ కార్యకర్తలు అదుపులోకి తీసుకున్నారు. సభలో సీఎం జగన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Read More : PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. 8.5శాతం వడ్డీకి కేంద్రం ఆమోదం

మరోవైపు..టీడీపీ, వైసీపీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. చంద్రబాబు ఫ్లెక్సీలను చించుతున్న వైసీపీ కార్యకర్తలను టీడీపీ నాయకులు అడ్డుకొని చితకబాదారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని.. రెండు వర్గాలను చెదరగొట్టారు. వైసీపీ కార్యకర్తల తీరును టీడీపీ శ్రేణులు చంద్రబాబు దృష్టికి తేవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More : Padayatra : అమరావతి రైతుల పాదయాత్రకు హైకోర్టు అనుమతి

2021, అక్టోబర్ 29వ తేదీ శుక్రవారం…సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రెండు రోజుల పాటు ఆయన టూర్ కొనసాగనుంది. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత.. తెలుగుదేశం పార్టీ పటిష్టతపై చంద్రబాబు దృష్టి పెడుతున్నారు. రెండు రోజుల పాటు ఆయన కుప్పంలోనే మకాం వేయనుండడంతో టీడీపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సహం కనిపిస్తోంది. మొదటి రోజు పలు పార్టీ కార్యక్రమాల్లో బిజీబిజీగా గడపనున్నారు. అలాగే శనివారం కుప్పంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తారు. టీడీపీ కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నింపడమే లక్ష్యంగా చంద్రబాబు పర్యటన కొనసాగనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Read More : Pattabhi Arrest Incident : పట్టాభి అరెస్ట్ సమయంలో నిబంధనలు పాటించని పోలీసు అధికారులపై వేటు

తెలుగుదేశం పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు, నియోజకవర్గంలో అధికార పార్టీకి పెరుగుతున్న మద్దతు దృష్ట్యా బాబు పర్యటనపై అందరి దృష్టి పడింది. టీడీపీ కార్యాలయంపై దాడి తర్వాత అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో బాబు టూర్‌ ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.