Gudivada Tension : గుడివాడలో టెన్షన్ టెన్షన్.. కొడాలి నాని ఇంటి ముట్టడికి టీడీపీ మహిళా నేతల యత్నం

కృష్ణా జిల్లా గుడివాడలో టెన్షన్ నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు టీడీపీ మహిళా నేతలు యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది.

Gudivada Tension : గుడివాడలో టెన్షన్ టెన్షన్.. కొడాలి నాని ఇంటి ముట్టడికి టీడీపీ మహిళా నేతల యత్నం

Gudivada Tension : కృష్ణా జిల్లా గుడివాడలో టెన్షన్ నెలకొంది. గుడివాడలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు టీడీపీ మహిళా నేతలు యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. గుడివాడలోని కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, తెలుగు మహిళలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు టీడీపీ మహిళా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల తీరుకి నిరసనగా తెలుగు మహిళలు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన కొడాలి నానికి, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొడాలి నాని తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీఎల్ పీ అంటే తెలుగు లయన్స్ పార్టీ అని వారు నినాదాలు చేశారు.

మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ కొడాలి నాని ఇంటి ముట్టడికి తెలుగు మహిళలు యత్నించారు. కొడాలి నాని క్షమాపణలు చెప్పాలంటూ ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బలవంతంగా టీడీపీ మహిళా నేతలను వాహనాల్లో ఎక్కించారు. గుడివాడ టీడీపీ ఇంచార్జి రావి వెంకటేశ్వరరావుతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో మహిళలను ఉద్దేశించి కొడాలి నాని అసభ్యకరంగా మాట్లాడారని మహిళా నేతలు ఫైర్ అయ్యారు.