Hindupur MLA : ఇవాళ బాలకృష్ణ మౌన దీక్ష

కొత్త జిల్లాల ప్రతిపాదనలు ప్రకటించిన వెంటనే బాలకృష్ణ హిందూపురాన్ని నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పుడు ఏకంగా మౌనదీక్షకు...

Hindupur MLA : ఇవాళ బాలకృష్ణ మౌన దీక్ష

Balakrishna

Hindupur MLA Balakrishna : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఓ వైపు ఆందోళనలు మరోవైపు మద్దతుగా ర్యాలీలు కొనసాగుతుండగా..హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సీన్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. కొత్తగా ప్రకటించిన సత్యసాయి జిల్లాకు హిందూపురాన్ని కేంద్రంగా చేయాలంటూ పోరాట బాట పట్టనున్నారు బాలకృష్ణ. 2022, ఫిబ్రవరి 04వ తేదీ శుక్రవారం హిందూపురంలో మౌన దీక్ష చేయననున్నారు. నిరసన ర్యాలీ చేపట్టి ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహం దగ్గర మౌన దీక్షలో కూర్చోనున్నారు. కొత్త జిల్లాల ప్రతిపాదనలు ప్రకటించిన వెంటనే బాలకృష్ణ హిందూపురాన్ని నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పుడు ఏకంగా మౌనదీక్షకు దిగుతున్నారు.

Read More : China : చైనా టార్చ్‌‌బేరర్ వివాదం, ఒలింపిక్ జ్యోతిని అందుకున్నది ఎవరు ?

అనంతపురం జిల్లాను రెండుగా విభజించి శ్రీత్యసాయి జిల్లాను ప్రతిపాదించింది ఏపీ ప్రభుత్వం. హిందూపురం పార్లమెంట్ స్థానంలోని ప్రాంతాలను ఈ జిల్లా పరిధిలోకి తెచ్చారు. హిందూపురాన్ని జిల్లా చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లాగా ప్రకటిస్తారని అనుకున్నారు. అయితే అందుకు విరుద్దంగా పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ప్రతిపాదించారు. దీంతో హిందూపురం వాసుల్లో ఆందోళన మొదలైంది. పార్లమెంట్ సెగ్మెంట్ హిందూపురం కాకుండా పుట్టపర్తిని ప్రకటించడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. ర్యాలీలు, నిరసనలు, బంద్‌లతో తమ డిమాండ్ వినిపించారు. జిల్లాల ప్రకటన విషయంలో హిందూపురంకు తీవ్ర అన్యాయం జరిగిందంటున్నారు. అటు జిల్లా కేంద్రంగా ప్రకటించాలని హిందూపురం పురపాలక సంఘం ఏకగ్రీవంగా తీర్మానించింది.

Read More : Deepika Padukune : అనన్య పాండే ఎవరో నాకు తెలీదు.. దీపికా పదుకునే వ్యాఖ్యలు.. ఫ్యాన్స్ ట్రోలింగ్

పాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నా. అయితే సత్యసాయి జిల్లాను హిందూపురం కేంద్రంగా ఏర్పాటు చేయాలి. అనంతపురం జిల్లాలో హిందూపురం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, వాణిజ్య పరంగా, పారిశ్రామిక పరంగా కూడా హిందూపురం అభివృద్ధి చెందిన విషయం అందరికీ తెలిసిందేనని బాలకృష్ణ వెల్లడించారు. జిల్లా కేంద్రానికి ఉండాల్సిన అన్ని అర్హతలు హిందూపురానికి ఉన్నాయని, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భూములు పుష్కలంగా ఉన్నాయన్నారు. హిందూపురం పట్టణ ప్రజల మనోభావాలను గౌరవించి వారి చిరకాల కోరిక అయిన హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి అని ప్రభుత్వాన్ని కోరారు బాలకృష్ణ.