Balakrishna Comments : నారా లోకేశ్ యువగళంపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు
టీడీపీ నేత నారా లోకేశ్ యువగళంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ పాదయాత్రను అడ్డుకుంటే జనం తిరగబడతారని జోస్యం చెప్పారు. యువగళంతో యువతకు భవిష్యత్ ఉండబోతుందన్నారు.

Balakrishna Comments : టీడీపీ నేత నారా లోకేశ్ యువగళంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ పాదయాత్రను అడ్డుకుంటే జనం తిరగబడతారని జోస్యం చెప్పారు. యువగళంతో యువతకు భవిష్యత్ ఉండబోతుందన్నారు. ఏపీ ప్రజలంతా నారా లోకేశ్ ను ఆశీర్వదించాలని కోరారు. తాను కూడా లోకేశ్ పాదయాత్రలో పాల్గొంటానని చెప్పారు. యువగళానికి అనుసంధానంగా హిందూపురంలో పలు కార్యక్రమాలను చేపడతానని పేర్కొన్నారు. ఇండియా మ్యాప్ నుంచి ఏపీ కనుమరుగయ్యే పరిస్థితి ఉందన్నారు.
నారా లోకేశ్ చిత్తూరు జిల్లా కుప్పం చేరుకున్నారు. టీడీపీ నేతలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. కాసేపట్లో టీడీపీ శ్రేణులతో లోకేష్ సమావేశం కానున్నారు. యువగళంప పార్టీ శ్రేణులకు లోకేశ్ దిశానిర్ధేశం చేయనున్నారు. రేపు కుప్పం నుంచి లోకేశ్ యువగళం ప్రారంభం కానుంది. దయం 11:30 గంటలకు లోకేశ్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కుప్పంలో బహిరంగ సభ ఉంటుంది. లోకేశ్ యువగళంతో కుప్పం పట్టణం పసుపుమయంగా మారింది.
గురువారం (జనవరి 26,2023) ఉదయం తిరుమల శ్రీవారిని నారా లోకేశ్ దర్శించుకున్నారు.
‘యువగళం’ పాదయాత్రకు ఎటువంటి ఆటంకాలు లేకుండా జయప్రదంగా జరగాలని తిరుమల వెంకన్నకు మొక్కుకున్నారు. లోకేశ్ కుప్పంలో తన పాదయాత్ర ప్రారంభించనున్నారు. లోకేశ్ తిరుమల రాకతో తిరుపతిలో కోలాహలం నెలకొంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తిరుపతి చేరుకున్నారు. లోకేశ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. తిరుమల స్వామి వారిని దర్శించుకున్న లోకేశ్.. కుప్పం చేరుకుని రాత్రికి ఆర్ అండ్ బీ అతిథిగృహంలో బస చేస్తారు.
27 మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం మునిసిపాలిటీ లక్ష్మీపురంలోని వరదస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభిస్తారు. టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెమ్మెల్యే బాలకృష్ణ లోకేశ్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. పాద్రయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పంలోని కమతమూరు రోడ్డులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.ఆ తరువాత గుడుపల్లె మండలం శెట్టిపల్లి చేరుకుంటారు. రాత్రికి పీఈఎస్ మెడికల్ కాలేజీ ఎదుట ఉన్న ఓ ప్రైవేటు స్థలంలో లోకేశ్ బస చేస్తారు. రెండో రోజు అక్కడి నుంచి శాంతిపురం మండలంలోకి ప్రవేశిస్తారు.