Home » Andhrapradesh » అద్దె అడిగాడని యజమానిని కొట్టి చంపిన అద్దెకుండే వ్యక్తి
Publish Date - 4:32 pm, Tue, 2 March 21
house owner killed by tenant in west godavari district,Palakollu : పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో దారుణం జరిగింది. ఇంటి అద్దె అడిగాడని యజమానిని అద్దెకుండే వ్యక్తి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది.
స్ధానిక ముచ్చర్ల వారి వీధిలోని వంగా ప్రసాద్ అనే వ్యక్తి ఇంట్లో చిన కొండయ్య కుటుంబం ఏడాది కాలంగా అద్దెకు ఉంటున్నారు. గత రెండు నెలలుగా చిన కొండయ్య ఇంటి అద్దె చెల్లించటంలేదు. ఈ క్రమంలో మార్చి నెల రావటంతో యజమాని ప్రసాద్ సోమవారం రాత్రి చిన కొండయ్యను అద్దె చెల్లించమని అడిగాడు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. వాగ్వాదం జరిగింది. ఆవేశంలో చిన కొండయ్య పక్కనే ఉన్న రాయి తీసుకుని ప్రసాద్ తలపై కొట్టాడు. ఆ దెబ్బకు ప్రసాద్ అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. ఈ విషయం గ్రహించిన చినకొండయ్య నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించాడు. ఘటనా స్ధలానికి వచ్చి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Hanuman Birth Place : హనుమంతుడి జన్మస్ధలంపై కొనసాగుతున్న వివాదం
Notification for Jobs : నిరుద్యోగులకు త్వరలో శుభవార్త చెప్పనున్న జగన్ సర్కారు
Judge Ramakrishna Arrest : జడ్జి రామకృష్ణ పై దేశద్రోహం కేసు.. అరెస్ట్
Heavy Rains : రైతన్నను ముంచిన అకాల వర్షాలు
Job Calendar: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో జాబ్ క్యాలెండర్
బయోటెక్నాలజీ-రూ.37వేల 400, కెమిస్ట్రీ-రూ.33వేలు.. పీజీ, డిగ్రీ కోర్సుల ఫీజులు ఖరారు