House Shrinking TPT : తిరుపతి శ్రీకృష్ణ నగర్‌లో ఉద్రిక్తత, పరిహారం ఇవ్వకుండా భవనం ఎలా కూలుస్తారు ?

తిరుపతి శ్రీకృష్ణ నగర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కుంగిపోయిన భవనం కూల్చివేతకు అధికారులు సిద్ధం చేస్తుంటే..ఇంటి యజమాని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

House Shrinking TPT : తిరుపతి శ్రీకృష్ణ నగర్‌లో ఉద్రిక్తత, పరిహారం ఇవ్వకుండా భవనం ఎలా కూలుస్తారు ?

Tpt

Tirupati Sri Krishna Nagar : తిరుపతి శ్రీకృష్ణ నగర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కుంగిపోయిన భవనం కూల్చివేతకు అధికారులు సిద్ధం చేస్తుంటే..ఇంటి యజమాని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సరైన పరిహారం ఇవ్వకుండా..ఎలా కూలుస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. కూల్చివేతకు అంగీకరించబోనని తేగేసి చెబుతుండడంతో ఏం చేయాలో అధికారులకు అర్థం కావడం లేదు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది రంగంలోకి దిగగా..బాధితులకు అండగా టీడీపీ నేతలు అక్కడకు వచ్చారు.

Read More : Visakha Ganja : అమెజాన్‌లో విశాఖ గంజాయి స్మగ్లింగ్

ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు తిరుపతిలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. భూ ప్రకంపనాలు రావడం, ఇళ్లకు బీటలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. శ్రీకృష్ణనగర్ లో ఓ భవనం కుంగిపోవడం కలకలం రేపింది. దీంతో భవనం కూల్చివేతకు అధికారులు రంగం సిద్ధం చేశారు. భవనానికి పగుళ్లు ఏర్పడ్డాయి. ఏక్షణమైనా భవనం కూలే ప్రమాదం  ఉండడంతో.. దానిని కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రస్తుతం భవనం చుట్టుపక్కల ఉన్న వారిని ఖాళీ చేయిస్తున్నారు. ముందస్తుగా శ్రీకృష్ణనగర్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

Read More : Tirupati : తిరుపతిలో కుంగుతున్న ఇళ్లు..18 ఇళ్ల గోడలకు పగుళ్లు, బీటలు

మరోవైపు…తిరుపతిలోని పలు ప్రాంతాల్లోని కొన్ని నివాసాల గోడలకు పగుళ్లు ఏర్పడడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 18 ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ బిల్డింగ్ లు ఎప్పుడు కూలుతాయో తెలియక స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరి శ్రీకృష్ణానగర్ లో భవనం కూల్చివేయవద్దని చెబుతున్న ఆ భవన యజమానికి అధికారులు నచ్చచెబుతారా ? లేక అతను డిమాండ్ చేస్తున్నట్లు పరిహారం అందిస్తారా ? చూడాలి.