Gold Price Today: పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం(10 గ్రాములు) రూ. 400 మేర పెరగగా, 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 440 మేర పెరిగింది.

Gold Price Today: పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold price

Gold Price Today: బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం(10 గ్రాములు) రూ. 400 మేర పెరగగా, 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 440 మేర పెరిగింది. బంగారంతో పాటు వెండి ధరలు పెరిగాయి. దేశీయంగా కిలో వెండిపై రూ. 800 పెరిగింది.

Gold

Gold

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఒకే విధంగా ఉన్నాయి. ప్రధానంగా హైదరాబాద్, విశాఖ పట్టణం, విజయవాడల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,150 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,530గా ఉంది. అదేవిధంగా హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నాయి. కిలో వెండి ధర రూ. 64,800 గా ఉంది.

Gold

Gold

చెన్నైలో 22 క్యారెట్ల (10గ్రాములు) బంగారం ధర రూ. 49,140 ఉంటే, ముంబైలో రూ. 48, 150, ఢిల్లీలో రూ. 48, 300, కోల్ కతాలో 48, 150, బెంగళూరులో రూ. 48, 200, కేరళ రాష్ట్రంలో రూ. 48, 150గా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధరలు చూస్తే.. చెన్నైలో రూ. 53,610, ముంబైలో 52,530, ఢిల్లీలో 52,690, కోల్ కతాలో రూ. 52,530, బెంగళూరులో రూ. 52,580, కేరళ రాష్ట్రంలో 52,530 గా ఉంది. అదేవిధంగా కిలో వెండి ధర చెన్నై, బెంగళూరు, కేరళ రాష్ట్రాల్లో రూ. 64,800 కాగా, ముంబై, ఢిల్లీ, కోల్ కతా రాష్ట్రాల్లో రూ. 59,300గా ఉంది.