కరోనా : వృద్ధులకు సూచనలు..ఏ పనులు చేయవద్దు

  • Published By: madhu ,Published On : March 30, 2020 / 01:15 AM IST
కరోనా : వృద్ధులకు సూచనలు..ఏ పనులు చేయవద్దు

కరోనా వైరస్ బారిన పడి చనిపోతున్న వారిలో ఎక్కువగా వృద్ధులే ఉంటున్నారు. 60 నుంచి 80 సంవత్సరాలు..ఇంకా వయస్సు పైబడి ఉన్న వారు మృతి చెందుతున్నరు. చైనా నుంచి వచ్చిన ఈ భూతం..ప్రపంచాన్ని చుట్టేసింది. లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో చనిపోతున్నారు. కానీ మృతి చెందుతున్న వారిలో వయస్సు మళ్లిన వారు ఎక్కువగా ఉంటుండడంతో ఆ ఏజ్ ఉన్న వారు భయపడిపోతున్నారు.

కానీ ఏ మాత్రం భయపడాల్సిన పని లేదని..కొన్ని టెక్నిక్స్, జాగ్రత్తలు పాటిస్తే వైరస్ సోకదని వైద్య నిపుణులు, కేంద్రం వెల్లడిస్తోంది. ఏ పనులు చేయవద్దు ? ఏ పనులు చేయవచ్చో తదితర వివరాలను తెలియచేశారు. 
 

చేయకూడని పనులు :-
* వృద్ధులు తరచూ చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రం చేసుకోకుండా..ముఖాన్ని తాకవద్దు. 
* ఏదైనా అనారోగ్యం వస్తే..వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సొంత వైద్యం పనికి రాదు. 
 

* ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు చేయించుకోవడానికి ఆసుపత్రికి వెళ్లకపోవడమే బెటర్. వీలైనంత వరకు..ఫోన్ లోనే వైద్యుల సలహాలు తీసుకోవాలి. అత్యవసరమైతే వెళితే మంచిది. 
* ఎవరితోనూ షేక్ హ్యాండ్స్, కౌగిలింతలు చేయవద్దు.
 

* ఎవరికైనా అనారోగ్యం ఉంటే..వారి దగ్గరకు వెళ్లవద్దు. 
* బయటి ఫుడ్ ను తీసుకోవద్దు. 

చేయాల్సిన పనులు :-
* తరచూ శుభ్రమైన మంచినీరు త్రాగాలి. 
* తాజా పండ్ల రసాలు తీసుకోవాలి. 
* ఎండాకాలం కావడంతో కొబ్బరి నీళ్లు, ఇతర ద్రావణ పదార్థాలు తీసుకోవాలి. 

* ఇంటి వద్దనే ఉండాలి. 
* ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే..మీటర్ దూరంగా ఉండాలి. 
* దగ్గినప్పుడు, తుమ్మిన సమయంలో టిష్యూ పేపర్, కర్చీఫ్, మోచేతిని అడ్డుగా పెట్టుకోవాలి. 

* ఇంట్లోనే వండిన వేడి వేడి ఆహారాన్ని తీసుకోవాలి. 
* వ్యాధి నిరోధకత పెంచే ఆహారాన్ని భుజించాలి. 
* ప్రతి రోజు ఎక్సర్ సైజ్ చేయాలి. 

* నిత్యం ధాన్యం చేయడం వల్ల మానసికంగా ధృఢంగా ఉంటారు. 
* అనారోగ్యం ఉన్న వృద్ధులు క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలి. 
* జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే..వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 

Also Read | చెట్టుపైన ఐదు రోజులుగా క్వారంటైన్‌ లో ఉన్న బెంగాల్ యువకులు ICDS కేంద్రానికి తరలింపు