Suicide : అదనపు కట్నం కోసం కూతురికి అత్తింటివారి వేధింపులు…మనోవేదనతో తండ్రి ఆత్మహత్య

అత్తవారింటి వేధింపులు తన కుమార్తెకు తప్పలేదు. దీంతో కన్నబిడ్డ కాపురం నిలబెట్టలేకపోయానని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షరామంలో చోటుచేసుకుంది.

Suicide : అదనపు కట్నం కోసం కూతురికి అత్తింటివారి వేధింపులు…మనోవేదనతో తండ్రి ఆత్మహత్య

Man Suicide

Father suicide with Depression : అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెకు ఘనంగా పెళ్లి చేశాడు ఆ తండ్రి. అన్యోన్యంగా ఉంటారని, ఎంతో ఆనందంగా వారి జీవితం సాగుతుందనుకున్నాడు. కానీ అత్తవారింటి వేధింపులు తన కుమార్తెకు తప్పలేదు. దీంతో కన్నబిడ్డ కాపురం నిలబెట్టలేకపోయానని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షరామంలో చోటుచేసుకుంది. కూతురి జీవితాన్ని నిలబెట్టలేని నిస్సాహయ స్థితిలో నిండు ప్రాణాలను విడిచాడు. తలపాగల శ్రీనివాస రావు ఆత్మహత్యతో కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తన చావుతోనైనా కుమార్తె కాపురం నిలబెట్టాలనుకున్నారు శ్రీనివాస రావు.

శ్రీనివాస రావు, సుజాత దంపతులకు ఇషామాలిని కుమార్తె ఉంది. స్థానికంగా మాలిని ఫోటో స్టూడియో నడుపుకుంటూ శ్రీనివాసరావు జీవనం సాగించాడు. పది నెలల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కారుపర్తి గౌతమ్ కుమార్‌తో వివాహం జరిపించారు. పెళ్లైన మూడురోజుల నుంచి అదనపు కట్నం కోసం భర్త.. ఇషామాలినిని వేధించడం మొదలు పెట్టాడు. అదనపు కట్నంగా ఐదు లక్షలు, బులెట్ బండి, పది కాసుల బంగారం కావాలని డిమాండ్ చేశాడు. అప్పటికి శ్రీనివాసరావు తన కూతురు మీదున్న ప్రేమతో అడిగినవన్నీ ఇస్తానన్నాడు. అందుకు ఒప్పుకున్న గౌతమ్‌ ఇంటికి తీసుకెళ్లి…మళ్లీ వేధింపులు మొదలుపెట్టాడు.

Corona Restrictions : దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్..కరోనా ఆంక్షలు మరోసారి పొడిగింపు

విషయం తెలుసుకొని తండ్రి శ్రీనివాసరావు మరుసటి రోజు ఏలూరు వెళ్లారు. అమ్మాయి ఒంటిపై ఉన్న దెబ్బలను చూసి విలపించారు. కుమార్తె అత్తింటివారిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు FIR నమోదు చేశారు. కానీ చర్యలు మాత్రం తీసుకోలేదు. దీంతో అప్పటి జిల్లా ఎస్పీని కలిసి విన్నవించారు. మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదులు చేశారు. అయినా కూడా న్యాయం జరగలేదు. దీంతో శ్రీనివాస రావు తీవ్ర మనోవేదకు గురయ్యారు.

తన తండ్రి మృతి చెందడానికి ముందు రోజు గౌతమ్‌.. ఇషామాలిని ఇంటికి వెళ్లామన్నారు. సమన్లు ఇవ్వడానికి ద్రాక్షరామం నుంచి ఒక కానిస్టేబుల్‌తో కలిసి వెళ్లారు. ఆ సమయంలోనూ కుమార్తె అత్తవారింటి మాటలతో శ్రీనివాస రావు మనోవేదనకు గురయ్యారు. దాంతో ఇంటికి వచ్చి…అందరం చనిపోదామని తనతో చెప్పారన్నారు ఇషా మాలిని. సమస్య పరిష్కారం కాదని పోరాడాదమని తన తండ్రి చెప్పారన్నారు. అయితే ఒకసారి పోలీసులకు తమ బాధ చెప్పాలనుకున్నారు. కేసు గురించి అక్కడి ఎస్‌ఐతో మాట్లాడుతుండగా కుప్పకూలారు. హుటాహుటిన అతన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్రీనివాసరావు మృతి చెందారు.

Chennai NGT : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు బ్రేక్

శ్రీనివాస రావు ఇంట్లో సూసైడ్ నోట్‌ దొరికింది. తన కూతురి భర్త, అత్తమామలను కలుపుకొని మొత్తం తొమ్మిది మందిపై కేసు నమోదు చేయాలని సూసైడ్‌ నోట్‌లో శ్రీనివాసరావు కోరాడు. తన కూతురికి పెళ్లి జరిగినప్పటి నుంచి అత్తింటి వారు తనని మానసికంగా వేధించడం ప్రారంభించారని లెటర్‌లో రాశాడు.. ఇషా వేధింపులకు గురవుతుండటంతో రోజూ బాధపడుతున్నానని.. తన కూతురు జీవితం నాశనం చేశానన్న మనోవేదన ఎక్కువైందన్నాడు. తన కూతురు జీవితం నాశనం చేసిన వారే తన ఆత్మహత్యకు కారణమని రాశారు.

న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని శ్రీనివాస రావు కుమార్తె ఇషా మాలిని చెప్తోంది. తన తండ్రి ఆత్మహత్యకు గౌతమ్ కుటుంబ సభ్యులే కారణమని ఆరోపించింది. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. పోస్ట్‌ మార్టం రిపోర్టు ఆధారంగా కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.