వివాహిత మహిళకు ఫోన్ చేసి…..

  • Edited By: murthy , October 21, 2020 / 10:44 AM IST
వివాహిత మహిళకు ఫోన్ చేసి…..

husband stabs a man : విజయవాడలో దారుణం జరిగింది. వివాహిత మహిళకు ఫోన్ చేసి తరచూ వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తిని ఆమె భర్త కత్తితో పొడిచాడు. కృష్ణలంక ప్రాంతంలో నివసించే మహిళకు పిచ్చయ్య అనే వ్యక్తి తరచూ ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతూ వేధింపులకు గురి చేస్తున్నాడు.

ఈ విషయాన్ని ఆ మహిళ తన భర్త సిధ్దుల రవిపాల్ కు చెప్పింది. రవిపాల్ తన భార్యతో పిచ్చయ్యకు ఫోన్ చేయించి స్టెల్లా కాలేజి వద్దకు రమ్మని పిలిపించాడు. అక్కడకు వచ్చిన పిచ్చయ్యను రవిపాల్ కత్తితో పోడిచి తీవ్రంగా గాయపరిచాడు.



పలుమార్లు కత్తితో పొడవటంతో పిచ్చయ్య అక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి పిచ్చయ్యను ఈఎస్ఐఆస్పత్రికి తరలించారు. రవిపాల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.