Black Fungus Suicide : తీవ్ర విషాదం.. భర్తకు బ్లాక్ ఫంగస్, ఆసుపత్రి బాత్రూమ్‌లో భార్య..

మాయదారి కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. ఎంతోమందిని పొట్టన పెట్టుకుని కుటుంబాలను రోడ్డున పడేసింది. కరోనా మహమ్మారి అంతులేని విషాదాలు నింపుతోంది. కరోనా నుంచి కోలుకున్నా ఆ తర్వాత తలెత్తుతున్న ఇన్ ఫెక్షన్లు మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. ఇన్ ఫెక్షన్లు తగ్గుతాయో లేదో అనే ఆందోళన ప్రాణాలు తీసుకునేలా చేస్తోంది.

Black Fungus Suicide : తీవ్ర విషాదం.. భర్తకు బ్లాక్ ఫంగస్, ఆసుపత్రి బాత్రూమ్‌లో భార్య..

Black Fungus Suicide

Black Fungus Suicide : మాయదారి కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. ఎంతోమందిని పొట్టన పెట్టుకుని కుటుంబాలను అనాథగా మార్చింది. కరోనా మహమ్మారి అంతులేని విషాదాలు నింపుతోంది. కరోనా నుంచి కోలుకున్నా ఆ తర్వాత తలెత్తుతున్న ఇన్ ఫెక్షన్లు మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. ఇన్ ఫెక్షన్లు తగ్గుతాయో లేదో అనే ఆందోళన ప్రాణాలు తీసుకునేలా చేస్తోంది.

భర్త బ్లాక్‌ ఫంగస్‌తో చికిత్స పొందుతుండగా.. నయమవుతుందో లేదోనన్న ఆందోళనతో అతని భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్‌లో బుధవారం(మే 26,2021) చోటు చేసుకుంది. పెదపూడి మండలం, జి.మామిడాడకి చెందిన సబ్బెళ్ల తిరపారెడ్డి కొవిడ్‌ నుంచి కోలుకున్నాక బ్లాక్‌ ఫంగస్‌ సోకింది. ఈ నెల 19 నుంచి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. అతనికి తోడుగా భార్య బుల్లిమావతి (48) ఉంటున్నారు. మంగళవారం ఆసుపత్రికి వచ్చిన కుమార్తె భువనేశ్వరితో బుల్లిమావతి తన ఆవేదన పంచుకుని విలపించారు. ఆ తర్వాత అందరూ నిద్రపోయాక ఆమె వార్డులోని మరుగుదొడ్డిలోకి వెళ్లింది. కిటికీకి చీరతో ఉరి వేసుకుని తనువు చాలించింది.

బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కూతురు గుర్తించింది. తల్లిని అలా చూసి నిర్ధాంతపోయింది. వెంటనే సిబ్బందిని పిలిచింది. కానీ, అప్పటికే ఆలస్యమైంది. ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆమె మరణంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన ఆసుపత్రిలోని ఇతర రోగులను కంటతడి పెట్టించింది.

కరోనా నుంచి కోలుకున్నాం అని బాధితులు ఆనందించే లోపే బ్లాక్ ఫంగస్ ఇన్ ఫెక్షన్ అటాక్ చేస్తోంది. బ్లాక్ ఫంగస్ బారిన పడ్డ బాధితులకు ఇంకా ప్రత్యేకమైన ట్రీట్ మెంట్, మందులు లేవు. ఇది ఆందోళనకు గురి చేస్తోంది. పైగా చికిత్సకు లక్షల్లో ఖర్చు అవుతోంది. అసలే పేద, మధ్య తరగతి కుటుంబాలు. దానికి తోడు చికిత్సకు లక్షల రూపాయలు వెచ్చించాలి. అంత డబ్బు ఖర్చు చేసినా నయం అవుతుందో లేదో తెలియని దుస్థితి. ఈ పరిణామాలు తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి. ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి.