Satyambabu : అయేషా మీరాను నేను హత్య చేయలేదు : సత్యంబాబు

ఈ కేసులో తాను నిర్దోషినని హైకోర్టు చెప్పిందని పేర్కొన్నారు. గతంలో సీబీఐ అధికారులు వచ్చి తనను పూర్తిస్థాయిలో విచారించారని వెల్లడించారు.

Satyambabu : అయేషా మీరాను నేను హత్య చేయలేదు : సత్యంబాబు

Satyambabu (1)

Satyambabu : అయేషా మీరా హత్య కేసులో సత్యంబాబు ఆరోపణలు ఎదుర్కొని జైలు శిక్ష అనుభవించి నిర్దోషిగా విడుదలైన విషయం తెలిసిందే. అయేషా మీరా కేసులో సీబీఐ అధికారులు రీ ఇన్వెస్టిగేషన్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికైనా అయేషా మీరాను చంపింది ఎవరో సీబీఐ అధికారులు నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పారు. ఈ మేరకు సత్యంబాబు 10టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.

ఈ కేసులో తాను నిర్దోషినని హైకోర్టు చెప్పిందని పేర్కొన్నారు. గతంలో సీబీఐ అధికారులు వచ్చి తనను పూర్తిస్థాయిలో విచారించారని వెల్లడించారు. ఆరోజు ఏం జరిగిందో, తాను ఎక్కడ ఉన్నాను అనేది సీబీఐ అధికారులకు పూర్తిగా వివరించానని తెలిపారు. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అయేషా మీరాను తాను హత్య చేయలేదని స్పష్టం చేశారు.

Satyam Babu : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు సత్యం బాబు లేఖ

అయేషా మీరా చనిపోయిన సమయం నుండి ఆమె తల్లిదండ్రులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా సీబీఐ అధికారులు స్పందించి ఆయేషా మీరాను హత్య చేసిన నిందితులను పట్టుకోవాలని కోరారు. తాను గతంలో నందిగామ పరిసర ప్రాంతాల్లోని హాస్టల్ లో ఉన్న ఆడపిల్లను వేధిస్తున్నానని తనపై కేసులు ఉన్నాయని తెలిపారు.