నాకు కరోనా లేదు..తీసుకెళ్లండి..కర్నూలు యువతి సెల్ఫీ వీడియో

  • Published By: madhu ,Published On : February 2, 2020 / 05:53 AM IST
నాకు కరోనా లేదు..తీసుకెళ్లండి..కర్నూలు యువతి సెల్ఫీ వీడియో

నాకు కరోనా వైరస్ సోకలేదు..నన్ను తీసుకెళ్లండి.. వైద్య పరీక్షలు చేయించండి..కేవలం జ్వరం మాత్రమే ఉంది..ఏపీ ప్రభుత్వం స్పందించాలి..అంటూ కర్నూలు జిల్లాకు చెందిన యువతి వేడుకొంటోంది. ఈ మేరకు 2020, ఫిబ్రవరి 02వ తేదీ ఆదివారం ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. దీనిని చూసిన తల్లి భయపడిపోతోంది. తమ కూతురిని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తల్లి వేడుకొంటోంది. 

వివరాల్లోకి వెళితే…
శృతి..కర్నూలు జిల్లా, బండి ఆత్మకూరు మండలంలో నివాసం ఉంటున్నారు. తండ్రి ఆర్మీలో పనిచేస్తూ..చనిపోయారు. శృతి ఇటీవలే..TCL ఉద్యోగ శిక్షణ కోసం చైనాకు వెళ్లింది. కొద్ది రోజుల కిందట కరోనా వైరస్ చైనాను గడగడలాడిస్తోంది. ఎంతమంది చనిపోగా..వేల సంఖ్యలో వైరస్ సోకింది. ప్రధాన నగరాల్లో ఒకటైన వూహాన్‌లో ఈ వైరస్ అధికంగా ఉంది. అక్కడి ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి.

చిక్కుకపోయిన భారతీయులు..
తెలుగు రాష్ట్రాలకు చెందిన వందలాది మంది అక్కడ చిక్కుకపోయారు. దీంతో కేంద్ర, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. అక్కడి వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమనాలు ఏర్పాటు చేశాయి. 2020, ఫిబ్రవరి 01వ తేదీ శనివారం, 2020, ఫిబ్రవరి 02వ తేదీ ఆదివారం ప్రత్యేక విమానాల ద్వారా భారతీయులను తీసుకొచ్చారు. కానీ శృతికి మాత్రం అనుమతించలేదు.

శృతికి నో ఎంట్రీ..
కరోనా భయంతో విమానంలో తీసుకొచ్చేందుకు అధికారులు అంగీకరించలేదు. తీవ్ర జ్వరం ఉండడంతో ఆమెకు నో చెప్పారు. దీంతో తన గోడును వినిపించేందుక సెల్ఫీ సహాయం తీసుకొంది. ఓ వీడియోను కుటుంబసభ్యులకు పోస్టు చేసింది. శృతి తల్లి ఆందోళన చెందుతోంది. తన బిడ్డను ఇంటికి పంపించాలని కోరుతోంది. 
 

సెల్ఫీ వీడియో..
58 మందిని తీసుకెళ్లారని, కానీ తనను తీసుకెళ్లలేదని వాపోయారు. తీవ్ర జ్వరం ఉండడంతో అనుమతించలేదని తెలిపారు. కానీ 2020, జనవరి 02వ తేదీ ఆదివారం నాడు మరొక విమానం వచ్చిందని, కానీ అందులో కూడా తనను తీసుకెళ్లడానికి నిరాకరించారని తెలిపారు. తనకు కరోనా వైరస్ సోకలేదని, కేవలం జ్వరం మాత్రమే ఉందని వెల్లడించారు. వెంటనే ఏపీ ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా వైరస్‌కు సంబంధించిన పరీక్షలు చేయించుకుంటానని, తనకు ఏమీ జరగలేదని తెలిపారు. మరి ఏపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. 

Read More : కరోనా : చైనా నుంచి వచ్చిన కుటుంబంపై రుయా సిబ్బంది నిర్లక్ష్యం