చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా నేనే ఉంటా : పవన్ కళ్యాణ్

  • Published By: veegamteam ,Published On : December 5, 2019 / 09:36 AM IST
చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా నేనే ఉంటా : పవన్ కళ్యాణ్

చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా నేనే ఉంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న వపన్ గురువారం (డిసెంబర్ 5) మదనపల్లెలోని చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..ఎన్నో కష్టాలకు ఓర్చుకుంటూ అద్భుతమైన పనితనంగా వస్త్రాలు నేతలు నేచే వీరంతా చేనేత కార్మికులు కాదనీ..చేనేత కళాకారులని ప్రశంసించారు. ఎంతో ఓర్పుతో నేర్పుతో వస్త్రాలు నేస్తూ..మన చేనేతలకు ఎంతో గొప్ప పేరు తెచ్చేవీరంతా కళాకారులని అన్నారు.   

దేవాలయాలలో ఉత్సవాలకు అమ్మవార్లకు, స్వామి వార్లకు పట్టువస్త్రాలు ఇస్తుంటారని అన్నారు. ఎంతో గొప్ప వస్త్రాలు నేసే నేతన్నలు ఎంతో గొప్ప వ్యక్తులని ప్రశంసించిన పవన్ చేనేతకు నేనే బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని తెలిపారు.

మహిళ కష్టాలు తీరుస్తానని వాగ్థానం చేసిన జగన్ సీఎం అయ్యారు ఆ మాటే మరచిపోయారనీ ఆరోపించారు. తమ పార్టీ వారికి ఉద్యోగాలు ఇప్పించుకునేందుకు ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారంటూ విమర్శించారు.  2.80 లక్షల ఉద్యోగాలు కల్పించి 4 లక్షల ఉద్యోగాల్ని తీసేశారనీ సీఎం జగన్ పై విమర్శలు సంధించారు.