బాలకృష్ణ చెయ్యి నా చెంపను తాకినందుకు గర్వపడుతున్నా, చెంప దెబ్బతిన్న అభిమాని

అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. ఓ అభిమాని చెంప చెళ్లుమనిపించిన ఘటన సంచలనం రేపింది. రాజకీయవర్గాల్లో వివాదానికి దారితీసింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

10TV Telugu News

iam with happy with balakrishna slap: అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. ఓ అభిమాని చెంప చెళ్లుమనిపించిన ఘటన సంచలనం రేపింది. రాజకీయవర్గాల్లో వివాదానికి దారితీసింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నీలకంఠాపురంలోని 10వార్డు టీడీపీ అభ్యర్థి ఇంటికెళ్లిన బాలయ్య, వారి ఇంట్లో జ్యూస్ తాగాడు. ఎన్నికలపై అభ్యర్థితో మాట్లాడుతుండగా, వారి కుమారుడు వీడియో తీశాడు. దీంతో బాలయ్యకు పిచ్చ కోపం వచ్చింది. వీడియో తీసిన వ్యక్తి చెంప చెళ్లుమనిపించాడు. ఆవేశానికి లోనైన బాలయ్య, వెంటనే ఆ వీడియో డిలీట్ చెయ్ అంటూ ఆ వ్యక్తి చెంప మీద కొట్టాడు. ఉన్నట్టుండి బాలయ్య కోపంతో ఊగిపోవడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.

ఈ ఘటనపై.. చెంప దెబ్బ తిన్న వ్యక్తి స్పందించాడు. ఎన్నికల ప్రచారంలో కనీసం ఎవరికీ షేక్ హ్యాండ్ కూడా ఇవ్వని బాలయ్య, తన చెంపను తాకినందుకు గర్వపడుతున్నానని బాధితుడు సోము చెప్పాడు. తాను బాలయ్య వీరాభిమానిని అని చెప్పాడు. తనను ఎవరో అనుకుని బాలయ్య చేయి చేసుకున్నాడని వివరించాడు.

దీన్ని కొందరు కావాలనే రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డాడు. బాలక్రిష్ణ అభిమానిగా తాను గర్వపడుతున్నట్టు సోము చెప్పాడు. బాలయ్య తన చెంప మీద కొట్టినందుకు తనకు ఎలాంటి బాధ లేదన్న సోము, పైగా, బాలయ్య చేయి తాకిందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

×