IAS Officer: గవర్నమెంట్ స్కూళ్లో పిల్లలను చేర్పించిన ఐఏఎస్ ఆఫీసర్

కాయాకష్టం చేసి డబ్బు సరిపోకపోయినా అప్పులు చేసి ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తుంటే, ఐఏఎస్ అధికారి ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. ఆర్థిక స్థోమత మెరుగ్గా ఉన్న అందరిలాగా కార్పొరేట్ స్కూల్స్ లో పిల్లలను చదవించకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివించేందుకు ముందుకొచ్చారు.

IAS Officer: గవర్నమెంట్ స్కూళ్లో పిల్లలను చేర్పించిన ఐఏఎస్ ఆఫీసర్

Ias Officer

IAS Officer:  కాయాకష్టం చేసి డబ్బు సరిపోకపోయినా అప్పులు చేసి ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తుంటే, ఐఏఎస్ అధికారి ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. ఆర్థిక స్థోమత మెరుగ్గా ఉన్న అందరిలాగా కార్పొరేట్ స్కూల్స్ లో పిల్లలను చదవించకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివించేందుకు ముందుకొచ్చారు. ప్రభుత్వాధికారులే ప్రైవేట్ స్కూళ్ల బాట పడుతుంటే ప్రభుత్వ పదోన్నతుల్లో ఉన్న వారిద్దరూ పిల్లలను గవర్నమెంట్ స్కూళ్లో చేర్పించారు.

శాప్ వీసీ, ఎండీ ఎన్ ప్రభాకరరెడ్డి తమ ఇద్దరు పిల్లలను విజయవాడలోని కోనేరు బసవయ్య చౌదరీ జెడ్పీ హైస్కూళ్లో చేర్పించారు. ఇది కొత్తేం కాదు.. గతంలో నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే వారిని చదివించారు. ప్రభాకరరెడ్డి సతీసమేతంగా వచ్చి పిల్లలకు అడ్మిషన్లు తీసుకున్నారు.

పాఠశాలలో వసతులు, విశాలమైన ఆట స్థలం ఉండటంతోనే ఇక్కడ చేర్పిస్తున్నామని తెలిపారు. కూతురు ఎనిమిదో తరగతి చదువుతుండగా, కొడుకు కోసం ఆరో తరగతి అడ్మిషన్ తీసుకున్నట్లు వెల్లడించారు.

Read Also : ఐఏఎస్ సేవకు అందరూ ఫిదా..వరదల్లో సర్వం కోల్పోయినవారికి అండగా తెలంగాణ ఆడబిడ్డ