Amaravati Land Scam : అమరావతి భూ కుంభకోణం వెనక ఐఏఎస్ అధికారుల హస్తం – ఆర్కే

ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు, ఆయన అనుచరులు దళితులను బెదిరించి భూములను లాక్కున్నారని.. వారి మనుషులను ప్రోత్సహించి రియల్‌ ఎస్టేట్ వ్యాపారం చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రైతుల భూములను చంద్రబాబు, నారాయణ బలవంతంగా లాక్కున్నారని అన్నారు. అమరావతి భూముల్లో అక్రమాలు జరిగాయని సాక్ష్యాలు ఉన్నాయని ఎమ్మెల్యే ఆర్కే పేర్కొన్నారు.

Amaravati Land Scam : అమరావతి భూ కుంభకోణం వెనక ఐఏఎస్ అధికారుల హస్తం – ఆర్కే

Amaravati Land Scam

Amaravati Land Scam : ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు, ఆయన అనుచరులు దళితులను బెదిరించి భూములను లాక్కున్నారని.. వారి మనుషులను ప్రోత్సహించి రియల్‌ ఎస్టేట్ వ్యాపారం చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రైతుల భూములను చంద్రబాబు, నారాయణ బలవంతంగా లాక్కున్నారని అన్నారు. అమరావతి భూముల్లో అక్రమాలు జరిగాయని సాక్ష్యాలు ఉన్నాయని ఎమ్మెల్యే ఆర్కే పేర్కొన్నారు.

రాజధాని ప్రాంతంలో పివోఏ, పివోటీ (Prohibition of Transfers) యాక్ట్ లను తుంగలోకి తొక్కి భూములు లాక్కున్నారని సీఐడీకి పిర్యాదు చేసినట్లు తెలిపారు. చంద్రబాబు, నారాయణ, కొందరు అధికారులు దళితుల్ని భయపెట్టి మోసం చేశారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దళితులను బెదిరించి భూములు లాక్కున్నారని.. వాటికి సంబందించిన వీడియోలు కూడా తమ దగ్గర ఉన్నాయని తెలిపారు. భూమిపుత్ర రియల్ ఎస్టేట్ ద్వారా తక్కువ రేటుకు భూములను కొనుగోలు చేశారని తెలిపారు.

భూమిపుత్ర రియల్ ఎస్టేట్ వెనక చంద్రబాబు ఉన్నారని రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో దళితులు ఉండకూడదని టీడీపీ నేతలు ఈ కుట్ర చేస్తారని వ్యాఖ్యానించారు రామకృష్ణా రెడ్డి. వీడియో ఆధారాలను సీఐడీ అధికారులకు అందిస్తానని తెలిపారు. భూమిపుత్ర రియల్ ఎస్టేట్ వ్యాపారి బ్రహ్మానంద రెడ్డిని అరెస్టు చేసి విచారణ చేయాలనీ డిమాండ్ చేశారు రామకృష్ణా రెడ్డి.

ఇక ఈ నేపథ్యంలోనే పలువురు అధికారులపై కూడా ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి ఆరోపణలు చేశారు. భూముల వ్యవహారం వెనక ఐఏఎస్అధికారులు కూడా ఉన్నారని అన్నారు. దళిత అధికారులే దళితులను చేసినట్లు ఆరోపించారు రామకృష్ణారెడ్డి.