ICET-2023: ఏపీ ఐసెట్, ఈసెట్ షెడ్యూల్స్ ప్రకటన.. పరీక్షల తేదీలివే

మార్చి 17న ఏపీ ఐసెట్-2023 నోటిఫికేషన్ విడుదలవుతుంది. మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈసెట్-2023కి సంబంధించిన నోటిఫికేష్ బుధవారం (మార్చి 8) విడుదలైంది. మార్చి 10-ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పూర్తి వివరాల కోసం సంబంధిత వెబ్‌సైట్ సందర్శించవచ్చు.

ICET-2023: ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాదికి సంబంధించి ఐసెట్-2023, ఈసెట్-2023 షెడ్యూల్స్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి బధవారం విడుదల చేసింది. ఏపీలోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఐసెట్ నిర్వహిస్తారు. అలాగే రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సెకండ్ ఇయర్ లేటరల్ ఎంట్రీ కోసం ఈసెట్ పరీక్షలు నిర్వహిస్తారు.

MLC Kavitha Letter ED : ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ.. మార్చి11న విచారణకు హాజరవుతా

మార్చి 17న ఏపీ ఐసెట్-2023 నోటిఫికేషన్ విడుదలవుతుంది. మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 20-26 వరకు రూ.1,000 ఆలస్య రుసుముతో, ఏప్రిల్ 27-మే 3 వరకు రూ.2,000 ఆలస్య రుసుముతో, మే 4-మే 10 వరకు రూ.3,000 ఆలస్య రుసుముతో, మే 10-మే 15 వరకు రూ.5,000 ఆలస్య రుసుముతో దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 16, 17 తేదీల్లో దరఖాస్తుల్లో సవరణలు చేసుకోవచ్చు. మే 20 నుంచి హాల్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. మే 24, 25 తేదీల్లో ప్రవేశ పరీక్షలు జరుగుతాయి.

India In UN: ముందు మీ దేశాన్ని బాగు చేసుకోండి.. పాకిస్తాన్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్

ఈసెట్-2023కి సంబంధించిన నోటిఫికేష్ బుధవారం (మార్చి 8) విడుదలైంది. మార్చి 10-ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 11-ఏప్రిల్ 15 వరకు రూ.500 ఆలస్య రుసుముతో, ఏప్రిల్ 16-ఏప్రిల్ 19 వరకు రూ.2,000 ఆలస్య రుసుముతో, ఏప్రిల్ 20-ఏప్రిల్ 24 వరకు రూ.5,000 ఆలస్య రుసుముతో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 28 నుంచి హాల్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. మే 5న ఈసెట్ పరీక్ష జరుగుతుంది. పూర్తి వివరాల కోసం సంబంధిత వెబ్‌సైట్ సందర్శించవచ్చు.

ట్రెండింగ్ వార్తలు